Home / ANDHRAPRADESH / నీ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్‌లో చేరుతావా..షర్మిల నీకసలు బుద్ధి ఉందా..?

నీ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్‌లో చేరుతావా..షర్మిల నీకసలు బుద్ధి ఉందా..?

తప్పు చేశావు శివగామి…కొడుకు మీద ప్రేమతో, చెప్పుడు మాటలు విని.. గుడ్డిగా బాహుబలిని చంపించావు అంటూ బాహుబలి సినిమాలో నమ్మినబంటు కట్టప్ప శివగామికి క్లాస్ పీకిన సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది…సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లో కూడా తప్పు చేశావు..షర్మిల…మీ అన్నను జైలుకు పంపి..మీ తండ్రిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ లో చేరి తప్పు చేశావు అంటూ వైఎస్ఆర్ టీపీ సీనియర్ నేత, వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మినబంటు అయిన కొండా రాఘవరెడ్డి షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్న ఏపీ సీఎం జగన్ మీద కోపంతో తెలంగాణలో రాజన్న రాజ్యం పెడతానని వైఎస్ఆర్‌టీపీ పేరుతో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల కేసీఆర్ సర్కార్ ను దించేస్తా..రాజన్న రాజ్యం స్థాపిస్తా మంగమ్మ శపథాలు చేసింది..ఆఖరికి తమ కుటుంబానికి అచ్చి వచ్చిన పాదయాత్ర కూడా చేసింది..కానీ పక్కా ఆంధ్రా పార్టీ అయిన వైఎస్ఆర్ టీపీని తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు..తాను తెలంగాణ కోడలిని అని షర్మిల నెత్తీనోరు బాదుకున్నా…తెలంగాణకు వెళ్లాలంటే పాస్ పోర్టులు కావాలంట..అంటూ తన తండ్రి డైలాగులు వల్లవేసిన సీమాంధ‌్ర బిడ్డగానే చూశారు…సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా కారుకూతలు కూసినా..అసలు షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూడలేదు..ఇక పాదాల మీద నడిచే యాత్రను పాదయాత్ర …యువత అని ఎందుకంటారు..వాళ్లు విద్యార్థులు కాబట్టి అంటూ షర్మిల నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాల్లాంటి డైలాగులు ఆమెను పొలిటికల్ కమేడియన్ గా మార్చాయి..ఇ

క సీమాంధ్ర మనస్తత్వం..అగ్రకుల అహంకారంతో షర్మిల పార్టీలో చేరిన నేతలను కించపర్చడంతో ఇందిరాశోభన్ వంటి కాంగ్రెస్ నుంచి చేరిన నాయకులు ఛీ కొట్టి మరీ వెళ్లిపోయారు..అసలు పార్టీ పెట్టి రెండేళ్లు అవుతున్నా…కనీసం పట్టుమని పది మంది నాయకులు చేరకపోవడం..అసలు 119 నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు అవడంతో షర్మిల చేతులెత్తేసింది..తనను నమ్ముకున్న కొద్దిపాటి నాయకులు, కార్యకర్తలకు మాట కూడా చెప్పకుండా కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసేందుకు రెడీ అయిపోయింది..బెంగళూరులో తమ సన్నిహితుడైన డీకే శివకుమార్ ని బతిమాలి..సోనియమ్మ అపాయింట్ మెంట్ తీసుకుని…మరీ కాంగ్రెస్ లో పార్టీని కలిపేయబోతుంది..షర్మిల చేసిన ద్రోహంపై వైఎస్ఆర్ టీపీ నేతలు మండిపడుతున్నారు. తనతో నడిచిన వందలాది మంది నాయకులను, వేలాది మంది కార్యకర్తలను నట్టేటా ముంచి తన రాజకీయ భవిష్యత్తు కోసం తన తండ్రిపై మరణించిన తర్వాత సీబీఐ కేసులు పెట్టిన, తన అన్నను 16 నెలలు జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైఎస్ఆర్‌టీపీ సీనియర్ నాయకులు కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.

కొండా రాఘవరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మినబంటు..గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులుగా పని చేశారు. జగన్ పార్టీనే ఆంధ్రాకే పరిమితం చేయడంతో కొన్నాళ్లు రాజకీయంగా సైలెంట్ గా ఉన్న కొండా రాఘవరెడ్డి..వైఎస్ఆర్ మీద అభిమానంతో షర్మిల పార్టీలో ముఖ్యభూమిక వ్యవహరించారు.అయితే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై కొండా రాఘవరెడ్డి తప్పు చేశావు షర్మిల అంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్‌టీపీకి రాజీనామా చేస్తున్నట్లు కొండా రాఘవరెడ్డి ప్రకటించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయనపై కేసు నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ చేరనని ఆయన తేల్చిచెప్పారు. అయితే ఎప్పటికీ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటానని, కానీ షర్మిలతో కలిసి కాంగ్రెస్ లో ప్రయాణం సాగించలేనంటూ..కొండా రాఘవరెడ్డి కుండబద్ధలు కొట్టారు..పార్టీలో మరోసీనియర్ నేత అయిన గట్టు రామచంద్రరావు కూడా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం షర్మిల మాత్రమే కాంగ్రెస్ లో చేరితే అది చేరిక అవుతుంది తప్పా..పార్టీ విలీనం అయినట్లు కాదని గట్టు షర్మిలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా తన తండ్రిని మరణాంతరం అవమానించిన, తన అన్న జగన్ పై అక్రమాస్తుల కేసులు పెట్టి జైలుకు పంపించిన సంగతి మర్చి కాంగ్రెస్ లో చేరడం వెనుక షర్మిలకు కుటుంబ బాంధవ్యాల కంటే అధికారమే ముఖ్యమని..అర్థమైందని..సగటు వైఎస్ఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat