తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, పార్టీని లాక్కుని ఆయన చావుకు కారకులైంది ఎవరూ అంటే…అన్ని వేళ్లు..ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూపిస్తాయి..ఎన్టీఆర్ కు వెన్నుపోటును చారిత్రక అవసరంగా పచ్చమీడియా చిత్రీకరించినా…పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన అభినవ ఔరంగజేబుగా చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కట్ చేస్తే..అది 1995, ఆగస్టు నెల…ఎన్టీఆర్ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది అయింది…ఈ ఏడాదిలోనే లక్ష్మీపార్వతిని రాజ్యాంగేతర శక్తిగా పచ్చపత్రికల్లో చిత్రీకరించిన చంద్రబాబు, నందమూరి కుటుంబసభ్యులను రెచ్చగొట్టాడు..ఇక్కడ లక్ష్మీ పార్వతి తప్పు కూడా ఉంది..భార్యగా ఎన్టీఆర్ బాగోగులు చూసుకుంటే పోయేది..పార్టీలో తాను కూడా పెత్తనం మొదలెట్టేసరికి గోతికాడ నక్కలా మామ సింహాసనం కోసం కాచుకూర్చున్న చంద్రబాబుకు అవకాశం ఇచ్చినట్లైంది.
సవతి తల్లిపై అమాయకులైన నందమూరి కుమారులకు, కుమార్తెలకు విషం నూరిపోసిన చంద్రబాబు పథకం ప్రకారం వెన్నుపోటుపర్వానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించాడు. 1995 లో టీడీపీలో ఆగస్టు సంక్షోభం సృష్టించిన చంద్రబాబు పథకం ప్రకారం నాటి రాజగురువు సహాయంతో టీడీపీ ఎమ్మెల్యేలందరిని తన గూటికి రప్పించాడు..వైస్రాయి హోటల్ లో వారందరిని దాచిపెట్టాడు..పాపం అన్నగారు తన తమ్ముళ్ల కోసం వైస్రాయి హోటల్ కు వస్తే చెప్పులు వేయించి అవమానించిన దుర్మార్గ మనస్తత్వం చంద్రబాబుది…అంతే కాదు అసెంబ్లీలో తన వాదన వినిపించడానికి వీల్లేకుండా ఎన్టీఆర్ కు మైకు ఇవ్వకుండా వెళ్లగొట్టిన ఘనాపాఠీ..ఈ మాయల మరాఠీ చంద్రబాబు. మామ ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై మచ్చ వచ్చేలా నాడు ఈనాడులో వ్యంగ్య కార్టూన్ లు వేయించాడు. పాపం అన్నగారు ఎంత మొత్తుకున్నా..చంద్రబాబు విసిరిన నోట్ల కట్టలకు లొంగిన నాయకులు, పత్రికాధిపతులు ఆయనకు అండగా నిలబడలేకపోయారు.
1995 లో ఆగస్టులో ఎన్టీఆర్ ని సీఎం కుర్చీ నుంచి విజయవంతంగా దించేసిన చంద్రబాబు సెప్టెంబర్ 1 న అంటే 28 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు..అసలు బాబుగారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఈ పరమ పవిత్ర దినాన్ని తెలుగు తమ్ముళ్లు ఏ స్థాయిలో పండుగ చేసుకోవాలి…పచ్చ మీడియా పిచ్చెక్కినట్లు జయం, జయం చంద్రన్నా అంటూ ప్రత్యేక కథనాలతో, పాటలతో ఎంత పరవశించిపోవాలి..కానీ అంతా గప్ చుప్…దీనికి కారణం.. చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు తీసుకుని 28 ఏళ్లు అయిందని సంబరాలు చేసుకుంటే కచ్చితంగా మామ ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటు గుర్తుకు వస్తోంది..సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు మామకు వెన్నుపోటు పొడిచి అప్పుడే 3 దశాబ్దాలు అవుతుందా అంటూ వెటకారం ఆడుతాయి..
అసలే ఎన్నికలప్పుడు మామ ఎన్టీఆర్ పై చంద్రబాబుకు అపారమైన ప్రేమ, భక్తి భావం పుట్టుకువస్తోంది..అందుకే పురంధేశ్వరీతో కలిసి ఢిల్లీలో ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమం చేశాడు..అయితే బీజేపీతో పొత్తు ప్రయత్నాల్లో బాగంగా ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్ విడుదల చేయిస్తే.. చరిత్రపురుషుడిని చెల్లని కాసు చేశారు కదరా మీ దుంపతెగ అంటూ నందమూరి అభిమానులు చంద్రబాబును, పురంధేశ్వరీని, బాలయ్యని, నందమూరి కుటుంబసభ్యులను ఆడేసుకుంటున్నారు..దీంతో మైలేజీ వస్తుందనకుంటే డ్యామేజీ అయిందని తలపట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు సీఎం అయిన 2 ఏళ్లు అయిందని సంబరాలు చేసుకోవాలని మనసులో ఉన్నా..ఎందుకు మళ్లీ అందరూ వెన్నుపోటు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి తనను కుళ్లబొడుస్తారని భయపడినట్లు ఉన్నాడు..అందుకే సైలెంట్ అయిపోయాడు..లేకుంటే పచ్చమీడియాలో ఈపాటికి చరిత్రపురుషుడు, విజనరీ, బోషాణం అంటూ ఇవాళ భజన కార్యక్రమాలు బోలెడు ఉండేవి..పాపం చంద్రబాబు..పండుగ చేసుకోవాలని ఉన్నా తన పరువును పీకి బజారున పడేస్తారని భయంతో సైలెంట్ అయిపోయాడు..ఈ కష్టం ఎవరికీ రాకూడదు బాబయ్యా..!