Home / ANDHRAPRADESH / సింహం సింగిల్‌గా వస్తుంది.. అర్థమైందా రాజా..?

సింహం సింగిల్‌గా వస్తుంది.. అర్థమైందా రాజా..?

నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది…. శివాజీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిన డైలాగ్..ఇప్పటికీ పాపురల్..ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సీన్ కు సరిగ్గా సెట్ అవుతోంది…వరుస సంక్షేమ పథకాలతో పేదల అభిమాన నాయకుడిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అర్థమైపోయింది..పైకి రోడ్ షోలు చేస్తూ సైకో పాలన పోవాలి..సైకిల్ పార్టీ రావాలి అంటూ పచ్చ తమ్ముళ్లతో పిచ్చెక్కించినట్లు డ్యాన్సులు వేయిస్తూ సైకోలా బిహేవ్ చేస్తున్న చంద్రబాబుకు లోలోపల మాత్రం జగన్ ని ఓడించడం అంత ఈజీ కాదనే నిజం భయపెడుతోంది..

సొంత పుత్రుడు లోకేశం పాదయాత్రలో అందరితో ఉచ్చ పోయిస్తా అంటూ అబ్బదబ్బ జబ్బా అంటూ జబ్బలు చరుస్తున్నా…దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహియాత్రలో టీడీపీతో కలుస్తా..జగన్ని ఓడిస్తా అంటూ రంకెలు వేయిస్తున్నా..ఇక ఏపీలో జగన్ పని ఖతం…టీడీపీ ప్రభంజనం వీస్తోంది అంటూ పచ్చ మీడియా పైత్యపు ప్రచారం చేస్తున్నా…మన బాబోరికి మాత్రం ఎక్కడో భయం వెంటాడుతోంది…జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలు అంత తేలికగా వదులుకోరని.. తన రాజకీయ జీవితానికి, టీడీపీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు మరణశాసనం రాయబోవడం ఖాయమని…ఈ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ లేదు..బొక్కా లేదు అంటూ టీడీపీ దుకాణం బంద్ చేయడమో లేదో జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పార్టీని పెట్టేసి ..ఇక తండ్రీ కొడుకులిద్దరూ పాలు, పెరుగు వ్యాపారం అమ్ముకోక తప్పదని చంద్రబాబలో చింత మొదలైంది..అందుకే గత ఎన్నికల్లో పెళ్లాం వదిలేసిన బోడివి నువ్వు..నువ్వు మళ్లీ ప్రధాని ఎలా అవుతావో చూస్తా అంటూ మోదీపై హూంకరించిన చంద్రబాబు..ఇప్పుడు అధికారం కోసం మళ్లీ మోదీ కాళ్లు పట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు…అందు కోసం తన తాబేదార్లు అయిన సుజనా చౌదరిని, సీఎం రమేష్ ని తెలివిగా 4 ఏళ్ల క్రితమే బీజేపీలోకి పంపించిన చంద్రబాబు వారితో లాబీయింగ్ చేయించాడు..ఆఖరికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుతో కూడా మోదీ ప్రాపకం కోసం ప్రయత్నించాడు..

అయితే కాగల కార్యం గంధర్వులే తెచ్చిపెట్టినట్లు..ఎన్టీఆర్ క్రేజ్ వాడుకోవాలనే ఉద్దేశ్యంతో కాషాయ పెద్దలు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరీని ఎంపిక చేసింది..ఇంకేముంది… పురంధేశ్వరితో బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీతో పొత్తుకోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే..ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్ ప్రోగ్రాం. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ ప్రైవేట్ కార్యక్రమాన్ని పచ్చమీడియాలో కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న అధికారిక కార్యక్రమంగా రక్తి కట్టించిన చంద్రబాబు…ఆ ప్రోగ్రాంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ముందు నడ్డి వంచి మాట్లాడిన ఫోటోలు బీజేపీలోని తన తాబేదారు సీఎం రమేష్ తో ఫోటోలు తీయించి…పచ్చమీడియాకు పంపించాడు..ఇంకేముంది..ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు..ఏపీలో మళ్లీ టీడీపీ, జనసేనతో పొత్తుకు బీజేపీ తహతహ..2024 లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడిగా పోటీ…ఇక జగన్ పని ఖతమని పచ్చమీడియా పిచ్చెక్కినట్లు బ్రేకింగ్ న్యూస్ లతో డప్పేసింది..బీ చంద్రబాబు కుటుంబసభ్యురాలైన పురంధేశ్వరీని బీజేపీ అధ‌్యక్షురాలిగా చేయడమే బీజేపీ చేసిన  తప్పు  మళ్లీ చంద్రబాబు చంకన చేరితే  ఏపీలో ఇక మళ్లీ జన్మలో పైకి లేవదు..మంచో చెడో..కనీసం పవన్ కల్యాణ్ ని నమ్ముకుని పోరాడితే ..మరో 5 ఏళ్ల తర్వాత అయినా..ఛాన్స్ ఉండచ్చు..కానీ చంద్రబాబు మాయమాటలకు, నక్కవినయాలకు లొంగిపోతే కమంల పార్టీ బురదలో కూరుకుపోవడం ఖాయం..

ఒకవేళ పచ్చ మీడియా ఊదరగొట్టినట్లు…టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తే ఓ రకంగా జగన్ నెత్తిన పాలుపోసినట్లే…. ఎన్నికల్లో జగన్ కు సహకరిస్తుందనే భయంతో బీజేపీతో పొత్తుకు రెడీ అవుతున్నాడో తెలియదు కానీ..బీజేపీని చంకలో పెట్టుకుంటే..ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ, దళిత వర్గాలు దూరమవుతాయని చంద్రబాబుకు అర్థం కావడం లేదేమో..ఏదేమైనా ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి..పట్టణ ప్రాంతాల్లో కాస్త వ్యతిరేకత ఉన్నా…కీలకమైన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వైసీపీ ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదు..అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, ఇలా ఎన్ని పార్టీలు కలిసి పందుల్లాగా గుంపులుగా వచ్చి పోటీ చేసినా..జగన్ సింహంలా సింగిల్ గా పోటీ చేసి..మళ్లీ గెలవడం ఖాయమని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మొత్తంగా నడ్డా ముందు నడ్డి వంచిన చంద్రబాబు..మోదీ కాళ్ల మీద మోకరిల్లినా..పొర్లు దండాలు పెట్టినా..మళ్లీ జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి..నాన్నా పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది..అర్థమైందా రాజా అంటూ బాబు దండుపాళ్ల్యం బ్యాచ్ ని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat