పొద్దున లేస్తే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతారంటూ సాంబడు, వెంకడు అనే ఇద్దరు పచ్చ మీడియా జర్నలిస్టులు..పిచ్చిపిచ్చిగా రంకెలు వేస్తూ విరుచుకుపడుతుంటారు..కానీ వైసీపీ నేతల కంటే బూతుల్లో పీహెచ్‌డీలు చేసిన టీడీపీ నేతలు చాలా మందే ఉన్నారు..అయ్యన్నపాత్రుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, ఆనం రమణారెడ్డి నోటి నుంచి జాలువారే మాటలు వింటే తెలుగు భాష అక్షరాలు తమకు తామే ఉరేసుకుంటాయి…మహిళలు అని కూడా చూడకుండా…మంత్రి అనే గౌరవం లేకుండా రోజా వంటి వైసీపీ మహిళా మంత్రులను అసభ్యకరంగా బూతులు తిట్టే టీడీపీ నేతల్లో అయ్యన్నపాత్రుడు ముందు వరుసలో ఉంటాడు…జగన్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా..రాయడానికి, మాటల్లో చెప్పడానికి వీలు కాని బూతులు తిట్టే అయ్యన్నపాత్రుడు పైకి మాత్రం పెద్ద మనిషిలా నీతులు చెబుతుంటాడు…ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్ లో లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయడానికి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ తో పాటు, వైసీపీ మంత్రులను పత్రికల్లో రాయలేనంత దారుణమైన బూతులతో రెచ్చిపోయాడు. దీంతో మాజీ మంత్రి పేర్నినాని ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పోలీసులు అయ్యన్నపాత్రుడి మీద 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు అనుచిత వ్యాఖ్యల కేసులో అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్‌గేట్ వద్ద వదిలేశారు. మొత్తంగా బూతులతో రెచ్చిపోయే అయన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
