Home / ANDHRAPRADESH / యువతిపై టీడీపీ నాయకుడు రేప్..ఇప్పుడు నోరెత్తవేం పవనూ..!

యువతిపై టీడీపీ నాయకుడు రేప్..ఇప్పుడు నోరెత్తవేం పవనూ..!

ఏపీలో వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, వారు మహిళల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రలో వీరావేశంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్ల వల్ల క్షేత్ర స్థాయిలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయి..అసలు జగన్ ప్రచారం చేయకపోయినా..వాలంటీర్ల వ్యవస్థ చాలు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భయపడుతున్నాడు..అందుకే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ని ఉసిగొల్పి వాలంటీర్లపై ప్రజల్లో ఏహ్యభావం కలిగించడానికి ఇలా వారిని టార్గెట్ చేయించాడని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎక్కడో ఒకరిద్దరు తప్పుడు పనులు చేస్తే మొత్తం వ్యవస్థకు అంటగడుతూ..పవన్ కల్యాణ్ వాలంటీర్లను రేపిస్టులుగా, అసాంఘిక శక్తులుగా చిత్రీకరిస్తున్నాడు.

అయితే  ఏపీలో పచ్చనేతలు కామాంధులుగా మారారు..నిత్యం ఎక్కడో చోట యువతులపై లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా కుమార్తె వయసు కలిగిన ఓ యువతిపై టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అనుచరుడు దారుణానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి అతనికి బాధిత యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం హులికల్లులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు… హులికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడైన బోయ సోమశేఖర్‌ (45) వరుసకు కోడలైన 20 ఏళ్ల యువతిపై ఎప్పటినుంచో కన్నేశాడు. అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక కారణంతో తరచూ ఆమె ఇంటి వద్దకు వెళ్లి గంటల తరబడి కాలక్షేపం చేసేవాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన సోమశేఖర్‌ ఆమె ఇంట్లోకి చొరబడి అస్యభకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటిస్తున్నప్పటికీ బలవంతంగా లైంగికదాడి చేశాడు. అనంతరం చెప్పులు అక్కడే వదిలి పారిపోయాడు. యువతి ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత యువతి తండ్రి ఇంటికి రావడంతో జరిగిన దారుణం గురించి తెలియజేసి కన్నీటిపర్యంతమైంది. అదే సమయంలో చెప్పుల కోసం తిరిగి యువతి ఇంటి వద్దకు వచ్చిన సోమశేఖర్‌ను గుర్తించిన బాధితురాలి తండ్రి, బంధువులు చితకబాదారు. అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన రూరల్‌ సీఐ యుగంధర్‌ మంగళవారం నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376 కింద (రేప్‌) కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేశారు. నిందితుడు సోమశేఖర్‌ను కళ్యాణదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్‌ విధించారు.

ఇక మరో ఘటనలో పార్టీలేదు..బొక్కా లేదంటూ టీడీపీ పరువు తీసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు అనుచరుడైన శాంతకుమార్ అనే యువకుడు విజయవాడకు చెందిన ప్రత్తిపాటి క్రిస్టీనా ఏంజుల అనే యువతిని ప్రేమ పేరుతో వంచించి..శారీరకంగా వాడుకుని, తీరా పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా వాడుకుని మోసం చేసిన శాంతకుమార్ పై క్రిస్టీనా కేసు పెట్టడంతో అచ్చెం నాయుడు అనుచరుడు బోసుబాబు కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరించాడు. అయితే శాంతికుమార్‌ తనను పెళ్లి చేసుకునే వరకు వదిలి పెట్టబోనని, అతని ఇంటి ముందు మౌన పోరాటం చేస్తానని తెలిపారు. పోలీసు అధికారులు సహకరించి తనకు న్యాయం చేయాలని క్రిస్టీనా వేడుకుంటోంది. వాలంటీర్లను రేపిస్టులుగా చిత్రీకరిస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు అమాయక యువతులపై లైంగిక దాడులకు పాల్పడిన పచ్చ నేతలు రేపిస్టులు కాదా.. ఈ అమానుష ఘటనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరెత్తడు..దీనికి కారణం..వాళ్లు టీడీపీ నేతల అనుచరులు కావడమే..తాను ఎక్కడ మాట్లాడితే దత్తతండ్రి చంద్రబాబుకు కోపం వస్తుందనే భయం.,అంతేగా పవనూ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat