మీరు చదివింది అక్షరాల నిజమే.. దాదాపు యాబై ఏండ్లకు దగ్గరలో ఉన్న ఒకప్పటి హాటెస్ట్ నేటి సీనియర్ నటి.. పొలిటీషియన్ అయిన నగ్మా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
దీని గురించి స్వయంగా నగ్మానే చెప్పారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ దాదాపు నలబై ఎనిమిదేండ్ల తర్వాత నాకు ఓ తోడుకావాలన్పిస్తుంది. ఇన్నేండ్లు కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు.
నాకు ఇప్పుడు పిల్లలుండాలని ఆశ పడుతున్నట్లు ఆమె తెలిపారు. అయితే కాలం కలిసి వస్తే త్వరలొనే తన పెళ్లి జరుగుతుందేమో అని ఆమె అన్నారు. కానీ పెళ్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటానని పేర్కొన్నది. సరిగ్గా పదహారు ఏండ్ల కిందట సినిమాలకు గుడ్ బై చెప్పిన నగ్మా తాజాగా రాజకీయాల్లో రాణిస్తుంది.