తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.. కేంద్రం తగ్గించిన గ్యాస్ సిలిండర్ పై ధర గురించి ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఇది ప్రజలకు కానుక కాదు..
సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే అని ట్విట్టర్ సాక్షిగా ఆమె విరుచుకుపడ్డారు. వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి కేవలం నామమాత్రంగా తగ్గించి ఏదో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.
గత పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ సిలిండర్ పై రూ ఎనిమిది వందలు పెంచి ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో రెండోందలు తగ్గించడం నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆమె అన్నారు.
First Increase the LPG cylinder price by ₹800/-
And then decrease it by ₹200/-It’s not a gift, but absolute gaslighting of people’s emotions and pockets.#gascylinder
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2023