తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తన్న కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకంలో భాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన చెక్కుల పంపిణి కార్యక్రమంలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు ముఖ్య అతిధిగా హాజరై ఆయా గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున లభ్డిదారులకు చెక్కులు అందజేశారు.
అనంతరం గౌరవ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఇంటికి పెద్దదిక్కుగా పేదింటి ఆడబిడ్డలకు మేన మామగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల బాంధవుడు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశంలో ఎక్కడ లేదని పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం BRS ప్రభుత్వం అని కెసిఆర్ గారి నాయకత్వంలో దేశంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వినర్ కరాడ్ బ్రహ్మానంద్, స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ భరత్, గ్రామ సర్పంచ్ జాదవ్ సునీత, మన్నూర్ సర్పంచ్ రాము, మారుతీ, రైతుబంధు జిల్లా డైరక్టర్ జలేందర్, ఎంపీటీసీలు షాగీర్ ఖాన్, న్యాను కేంద్రే, మాజీ ఎంపీటీసీ వినోద్, సీనియర్ నాయకులు ఆనంద్ సొంతక్కే రావణ్ ముండే జంగు, సీతాగొంది ఉపసర్పంచ్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు సంతోష్ గౌడ్, మండల యువ నాయకులు శ్రీకర్ గౌడ్, గ్రామ యూత్ అధ్యక్షులు కళ్లేపల్లి ప్రశాంత్, మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.