యూట్యూబర్ గా పరిచయమై స్టార్ హీరోల మూవీస్ లో చిన్న చిన్న పాత్రలల్లో నటించి మెప్పించి ఓ మూవీలో కీరోల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని యువత మదితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న లేటెస్ట్ హాట్ బేబీ వైష్ణవి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంఫర్ హిట్ కొట్టిన కలెక్షన్ల సునామీ బేబీ మూవీలో హీరోయిన్ గా నటించింది వైష్ణవి.
ఈ చిత్రం దాదాపు వంద కోట్ల దగ్గరకు కలెక్షన్ల సునామీని సృష్టించింది. వైష్ణవి ఓ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది..
ఆ ఇంటర్వూలో ఒకవేళ బేబీ మూవీలో నటించిన హీరో ఆనంద్ దేవరకొండ.. మరో సైడ్ క్యారెక్టర్ నటుడు విరాజ్ లలో ఎవర్ని పెళ్లి చేసుకుంటారని వైష్ణవిని అడిగితే దానికి సమాధానంగా ఇద్దర్ని పెళ్లి చేసుకోను. ఎందుకంటే ఇద్దరిలో ఒక్కొ క్వాలిటీ ఇష్టమని చెప్పింది.