న్న మీద కోపంతో తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన షర్మిలక్క దుకాణం సర్దేసి పనిలో ఉన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి తెలంగాణలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేస్తానంటూ అక్క కీచుకంఠంతో తెగ శపథాలు చేసేసింది..అసలు పార్టీ పెట్టగానే కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ఆర్ అభిమానులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా తన పార్టీలోకి వస్తారంటూ షర్మిలక్క తెగ ఊహించుకుంది..కానీ ఏదో ఒకరిద్దరు ఛోటామోటా నాయకులంతా తప్పా షర్మిల పార్టీ వైపు పెద్ద నాయకులు, కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కన్నెత్తి చూసింది లేదు…ఆఖరికి తమ కుటుంబానికి కలిసి వచ్చిన పాదయాత్ర చేసినా ఫలితం లేకపోయింది..కేసీఆర్ , కేటీఆర్ ను, బీఆర్ఎస్ మంత్రులను మగతనం అంటూ రెచ్చిపోయి మాట్లాడినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు..ఇక గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు రికార్డు స్థాయిలో పాదయాత్ర చేసి వైసీపీని నిలబెట్టిన షర్మిల…తెలంగాణలో మాత్రం పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అంటూ కామెడీ పీస్ అయిపోయింది. తెలంగాణలో ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా పట్టుమని పదిమంది జనం తనతో లేకపోవడంతో షర్మిలక్కకు ఎట్టకేలకు తత్వం బోధపడింది. ఇక లాభం లేదనుకుని డీకే శివకుమార్ ద్వారా రాయబారం నడిపి..తన అన్నను అవమానించి, జైలుకు పంపించిన సోనియమ్మ కాళ్ల దగ్గర చేరి సీట్ల కోసం బేరాలకు దిగింది. తనకు, తన వర్గానికి ఏకంగా 5 సీట్లు ఇవ్వాలంటూ డిమాండ్లు చేసిందని టాక్.
అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం..తెలంగాణలో నిన్ను ఎవరూ పట్టించుకోరు..ఏపీకి వెళ్లిపో.. అక్కడ మీ అన్నకు వ్యతిరేకంగా పోరాడు…కావాలంటే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు కూడా అప్పచెబుతామని చెప్పారంట…అయితే జగమొండి షర్మిల మాత్రం..నా అత్తారిల్లు అయిన తెలంగాణలో మాత్రమే ఉంటా…ఏపీకి వెళ్లను అని మొండికేసిందంట..(అన్నకు ఎదురెళ్లితే ఏం జరుగుతుందో షర్మిలకు తెలుసనుకుంటా) ..సర్లే ఈ విషయాలు తర్వాత తేల్చుదాం..ముందు పార్టీని కాంగ్రెస్ లో కలిపేయి అని ఢిల్లీ పెద్దలు చెప్పారంట….ఇక రేపోమాపో కాంగ్రెస్ పెద్దల నుంచి అనుమతి వస్తే వైఎస్ఆర్టీపీ దుకాణం సర్దేయడానికి షర్మిలక్క రెడీ అయిపోయింది.. కాకపోతే పాలేరు సీటుపై కన్నేసి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఫిక్స అయిన షర్మిల టికెట్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తోంది..ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పై ఆగ్రహంతో ఉన్న తుమ్మలను హస్తం గూటిలోకి లాగేందుకు రేవంత్ రెడ్డి, పొంగులేటి వంటి నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అయితే తుమ్మల మాత్రం ఏ పార్టీలో చేరినా పోటీ చేసేది మాత్రం పాలేరు నుంచే అని ఢంకా బజాయించి చెబుతున్నారు.
మొదట ఖమ్మం నుంచి పోటీ చేయమన్న కాంగ్రెస్ పెద్దలు అవసరమైతే పాలేరు టికెట్ అయినా ఇస్తాం..కావాలంటే షర్మిలను సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాం..అక్కడ క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఎక్కువ కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు అని చెబుతున్నారంట…తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయింది. దీంతో షర్మిల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడినట్లైంది. ఇటు పార్టీని నడపలేక..అటు పాలేరు టికెట్ వచ్చే అవకాశాలు దూరమవుతుండడంతో షర్మిలక్క ఫుల్ ప్రస్టేషన్ లో ఉందంట..పాలేరు నుంచి పోటీ అని ఫిక్స్ అయి…అక్కడ పార్టీ ఆఫీసు కూడా పెట్టిన షర్మిల… సికింద్రాబాద్ టికెట్ ఇచ్చినా పోటీ చేయడం కష్టం…పైగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో షర్మిలక్కకు అసలే పడదు..షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చి పాలేరు నుంచి పోటీ చేయించి…షర్మిలను మెల్లగా ఏపీకి తరిమేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని గాంధీభవన్ టాక్. మొత్తంగా తుమ్మల ఎంట్రీతో షర్మిలక్క రాజకీయ జీవితం గందరగోళంలో పడినట్లే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న షర్మిల కోరిక నెరవేరుతుందా…లేదా తుమ్మల దెబ్బతో తెలంగాణ వదిలి ఏపీ రాజకీయాల్లో లెగ్గుడుతుందా అనేది చూడాలి.