తెలంగాణ వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొడుతూ బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగూరి నర్సింహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు చేరుతున్నారని చెప్పారు. పాత, కొత్త అనే బేధం లేకుండా అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.