Home / EDITORIAL / కాంగ్రెస్‌ పగటి కలలు!

కాంగ్రెస్‌ పగటి కలలు!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరు వారి అధికార దాహాన్ని, అధికారం కోసం వారి అసహనాన్ని తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మాటలు, చేతులు మరీ శ్రుతిమించుతున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత కోతల రాయుడి తరహా మాటలతో ఊరేగుతున్నారు. నాలుగు నెలల తర్వాత అధికారం మాదేనని, బీఆర్‌ఆర్‌ఎస్‌ బంగాళాఖాతంలో కలుస్తుందని కాంగ్రెస్‌ నేతలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. అవినీతి కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లే పరిస్థితులు రాబోతున్నాయని భవిష్య వాణి వినిపిస్తున్నారు! కానీ అర్థం పర్థం లేని కాంగ్రెస్‌ నాయకుల ఆరోపణలను ప్రజలు నమ్మరని వారికి తెలియదు. తమ కలలన్నీ పగటి కలలేననే విషయం కూడా వారికి తెలియదు పాపం!

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికలకు మూడు నెలల ముందుగానే దాదాపుగా 95 శాతం నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ దెబ్బతో కాంగ్రెస్‌ దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఉక్కిరి బిక్కిరవుతున్నది. ఇతడే కాంగ్రెస్‌ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించలేని దుస్థితితో ఆ పార్టీ ఉంది!

రాజకీయాల్లో సహేతుక విమర్శలు చేస్తే హుందాగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై గోబెల్స్‌ తరహాలో విష ప్రచారానికి తెర లేపారు. మొత్తం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయని కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్‌ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఆకుకు అందని, పోకకు పొందని ఆరోపణలు చేస్తూనే, తాము అధికారంలోకి వస్తే ప్రజల పాలిట శాపంగా మారిన ధరణిని రద్దు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాదు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు కట్టవద్దని, రుణాలు తీసుకోనివారు బ్యాంకు రుణాలు తీసుకోవాలని ప్రేరేపిస్తున్నారు.

ఇలాంటి మాటలు, వాగ్దానాలు రెచ్చగొట్టే వి మాత్రమేనని ఎవరికైనా అర్థమవుతుంది. ధరణి రద్దు చేస్తామంటే, దానికన్నా ఉత్తమమైన రీతిలో ఏం అమలులోకి తెస్తారో చెప్పకుండా ఉన్న ఫలంగా ధరణిని రద్దు చేస్తామని అంటే.. తిరిగి పాత పద్ధతిలో పూర్వపు కరణం, మాలీ పటేళ్ల లంచాల రాజ్యాన్ని తేవాలనుకుంటున్నారా? అయితే అదైనా స్పష్టంగా ప్రకటించాలి. భూముల కొలతల్లో, యాజమాన్యాల్లో, తప్పుల సవరణలో సమస్యలు తొలగించి ఉత్తమమైన పోర్టల్‌ తేవాలి గానీ, ధరణినే రద్దు చేస్తామనటం.. ఇంట్లో ఎలుకలున్నాయని చెప్పి ఇంటిని తగులబెట్టుకున్నట్టుగా ఉన్నది కాంగెస్‌ నేతల వ్యవహారం. ఇలాగే అన్ని విషయాల్లోనూ కాంగెస్‌ నేతలు ప్రవర్తిస్తుండటం గమనించవచ్చు.

ఎలాగూ.. తాము అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ఇష్టారీతిన హామీలు గుప్పించవచ్చని కాంగ్రెస్‌ నేతలు అనుకుంటున్నట్టున్నారు! అయితే వారి పతనాన్ని వారే కొని తెచ్చుంటున్నట్టుగా ఉన్నది వారి తీరు. విపక్షాలు అధికార పక్షంలోని తప్పులను, వైఫల్యాలను ఎత్తి చూపి, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఆచరణాత్మకంగా ప్రజలకు తెలియజేయాలి. అంతేకానీ ఏవో గాలి మాటలు, యతి ప్రాసలతో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ప్రజల్లో కొంతకాలం అయోమయం రేపొచ్చేమో కానీ ప్రజలను తప్పుదారి పట్టించటం అసాధ్యం.

ఈ మధ్యన చూస్తే… ప్రజా గాయకుడు గద్దర్‌ మరణాన్ని కూడా కాంగెస్‌ వారు తమ ఓటు బ్యాంకు రాజకీయాలతో అపవిత్రం చేశారు. ఆయన పార్థివదేహం దవాఖానలో ఉండగానే రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి పెద్ద రాజకీయ నాటకానికి తెర లేపారు. గద్దర్‌ ఏదో తమ పార్టీ కార్యకర్త అయినట్టు.. అంతా తాను ముందుండి నిర్వహిస్తానని ప్రకటించి ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. గద్దర్‌ పార్థివదేహాన్ని రేవంత్‌ రెడ్డే హైదరాబాద్‌లోని ఎల్బీ సేడియానికి తరలించారు. కానీ.. అక్కడ కనీస ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించకుండా కొద్ది సేపటికే కనిపించకుండాపోయారు. లైట్లు, తాగునీళ్లు లాంటి కనీస ఏర్పాట్లుచేయకుండా చేతులు దులుపుకొని గద్దర్‌ అభిమానులను, ప్రజా సంఘాలను, ప్రజలను అవమానపరిచారు. ఇదంతా ఎందుకు చేశారంటే… గద్దర్‌ను పట్టించుకున్నట్టు షో చేస్తే.. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చన్న దురాలోచన తప్ప మరేమీ కాదు!

ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తున్న సీఎం కేసీఆర్‌ తనదైన పద్ధతిలో రాష్ట్ర పభుత్వం తరపున గద్దర్‌కు తగిన గౌరవ మర్యాదలు అందేటట్టు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు నిర్వహించటం తెలంగాణ సర్కారు నిబద్ధతకు నిదర్శనం. ఇదిలా ఉంటే… ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. కాంగెస్‌ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలను ప్రభావితం చేయలేకపోతున్నదనేది వాస్త వం. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ శక్తిగా ఓటర్లలో ఎప్పుడో గుర్తింపును, విశ్వాసాన్ని కోల్పోయింది.బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికలకు మూడు నెలలు ముందుగానే దాదాపుగా 95 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ దెబ్బతో కాంగెస్‌ దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఎక్కడా ఇతడు తమ అభ్యర్థి అని, ఇతడే కాంగ్రెస్‌ తరపున ముఖ్యమంత్రి అని ప్రకటించలేని దుస్థితితో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నది.

ఇప్పటికైనా కాంగెస్‌ చరిత్ర నుంచి గుణపాఠాలను నేర్చుకొని నడుచుకోవాలి. అవినీతి, అక్రమాల మకిలీ చరితను సరి చేసుకోవాలి. పార్టీలోని గ్రూపు రాజకీయాలను రూపు మాపు కోవాలి. బీసీ నాయకులకు తగిన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వా లి. ప్రజల కోసం పనిచేసే నాయకులను గుర్తించి ప్రోత్సహిం చాలి. నిరంతరం కార్యకర్తలకు, ప్రజలకు అగ్రనేతలు అందు బాటులో ఉండాలి. కేవలం ఎన్నికల సందర్భంలోనే జమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలను దించినట్లుగా విమర్శలు చేస్తూ ఓట్లు రాల్చుకోవాలనుకుంటే భంగపాటు తప్పదు. ఏడు దశాబ్దాల సీమాంధ్ర వలసవాద పాలనను తుదముట్టించి స్వీయ పాలన చేపట్టిన ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌ ప్రజానుకూల పాలనను అందిస్తున్నది. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి దిశలో నడిపిస్తున్నది. అన్నివర్గాల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఎవరెన్ని కుటలు, కుయుక్తులు పన్నినా ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావటం ఖాయం! ప్రగతి సాధనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణలో మళ్లీ సీఎం అయ్యే ది కేసీఆరే!

(వ్యాసకర్త:టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌)

-అనిల్‌ కూర్మాచలం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat