ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలో ఈ సంవత్సరం ఆగస్టు 30, 31 న శ్రావణ పౌర్ణమి వచ్చింది.. 31 నాడే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచించారు.
31న పౌర్ణమితిథి సూర్యోదయంలో ఉ.7.55 నిమిషాల వరకు ఉందని తెలిపారు. ఆ రోజు ఉ.6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజు రాఖీ కట్టాలని చెప్పారు. గురువారం ఉ.6 గంటల నుంచి ఉ.8లోపు రక్షాబంధనము చేసుకోవాలని వివరించారు