తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో BDC దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ అధ్వర్యంలో హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంలో సెప్టెంబర్ 9, 10 తేదీ లలో జరుగనున్న వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం 4 వేల రూపాయల పెన్షన్ ను ప్రవేశ వారి ఆత్మ గౌరవాన్ని పెంచారన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని ప్రవేశపెట్టి క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లను, ఉన్నత విద్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. దివ్యాంగుల క్రీడలను తెలంగాణ క్రీడా శాఖ ఎంతో ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 17500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించమన్నారు. చేతన ఫౌండేషన్, BDC దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీల్ చైర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కు ప్రభుత్వ పరంగా సహాకారం అందిస్తామన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.ఈ కార్యక్రమంలో రాష్ట్ర BDC దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ అధ్యక్షులు శ్రీధర్ కోటేశ్వర్, రామకృష్ణ, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.