టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో “కమ్మ”గా సాగుతున్న సంగతి తెలిసిందే. కులగణం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో సహజంగానే కులాభిమానులు, టీడీపీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో చినబాబు లేనిపోని వీరావేశం తెచ్చుకుని కట్ డ్రాయర్లతో రోడ్డ మీద తిప్పుతా…ఉచ్చ పోయిస్తా అంటూ మామ బాలయ్య లెవెల్లో బూతులు లంకించుకుంటున్నాడు. ఇక అంతే కాదు..చంద్రబాబును ఇబ్బందిపెట్టిన వాళ్లను, జగన్ కు అనుకూలంగా పని చేసే అధికారుల పేర్లను రెడ్ బుక్ లో ఎక్కించాను..అధికారంలోకి రాగానే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడు..ఇక చినబాబు దగ్గర మార్కులు కొట్టేయాలనుకునే బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా, బోండా ఉమ లాంటా నాయకులు అధికారంలోకి రాగానే కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలనే లేస్తామంటూ బహిరంగంగా వార్నింగ్ లు ఇస్తున్నారు. అయితే లోకేష్ లాగే తెలంగాణలో చంద్రబాబు అనుచరుడిగా పేరుగాంచిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు అనుకూలంగా పని చేస్తున్నారంటూ కొందరు పోలీసు అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఎక్కించా…తెలుగు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ల అంతు చూస్తా అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు..ప్రస్తుతం లోకేష్, రేవంత్ రెడ్డిల రెడ్ బుక్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది…
ఇదిలా ఉంటే..తన పేరు రెడ్ బుక్ లో ఎక్కించారని, తనను చంపేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కుట్ర చేస్తున్నాడంటూ…స్వయానా ఆ పార్టీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు ఢిల్లీలో ఈసీ ముందు ఫిర్యాదు చేశారు. లోకేష్ తన పేరును రెడ్ బుక్ లో ఎక్కించాడని, ఆయనతో తనకు ప్రాణహాని ఉందంటూ ఈసీ ఎదుట ఆకుల వెంకటేశ్వరరావు గోడు వెళ్లబోసుకున్నాడు. టీడీపీ కోసం ఆస్తులు పోగోట్టుకున్నా అంటూ ఆవేదన చెందారు. జూబ్లిహిల్స్ లో తనకు చెందిన 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కే.ఎల్. నారాయణ లాక్కున్నాడని, న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోవడం లేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. అందరిని వాడుకుని వదిలేసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు పార్టీ కోసం తనను కూడా వాడుకుని వదిలేసాడని, పార్టీ లేదు..బొక్కా లేదు అన్న అచ్చంనాయుడిని టీడీపీ అధ్యక్షుడిని చేశారని ఆకుల వెంకటేశ్వరరావు విమర్శించారు. మొత్తంగా లోకేష్ రెడ్ బుక్ లో తన పేరు ఉందని, ఆయనతో తనకు ప్రాణహాని ఉందంటూ ఈసీ ఎదుట టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరావు చేసిన ఫిర్యాదు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.