Home / SLIDER / తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు

తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు

తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలానికి చెందిన 1186 మంది దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3016/- రూపాయల నుంచి 4016/- రూపాయల పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగుల అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడ దివ్యాంగుల పెన్షన్ రూ,, 4016/- రూపాయలు పెంచాలనే ఆలోచన చేయలేదన్నారు.

కెసిఆర్ గారు ఏ సంక్షేమ కార్యక్రమం పధకాలు అమలు చేసినా రాజకీయ కోణంతో ఆలోచన చేయలేదు, పార్టీలు చూడలేదు, పేదరికమే గీటు రాయిగా పని చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాలు పరిపాలించినా 200 రూపాయిలు కంటే ఎక్కువ పెంచాలి అనే ఆలోచన రాలేదు, చేయలేదు . భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా పింఛన్ 600/- రూపాయలు కంటే ఎక్కువ ఇవ్వటం చేత కాలేదు కానీ, తెలంగాణ లో మాత్రం పింఛన్ 4000/- ఇస్తాము అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలు నమ్మి మోస పోవద్దు. దివ్యాంగుల సోదరి సోదరులు అడగపోయిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు 3016/- రూపాయలు నుంచి 4016/- కు పింఛన్ పెంచిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారు. దివ్యాంగుల సోదరి సోదరులకు గృహలక్ష్మి పథకంలో కూడా ముందు మీకే ప్రాధాన్యత కల్పించాలని, మీకు రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు.

పెళ్లిళ్ళు చేసుకునే నిరుపేదలకు రూ,, 1,00,116/- లక్షా నోట పదహారు రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చే గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే సండ్ర అన్నారు . ఎలక్షన్ లు వచ్చినప్పుడే రంగురంగుల కండువాలు వేసుకొని మీ ముందుకు వచ్చే సీజనల్ నాయకుల మాటలు నమ్మితే అభివృద్ధి కుంటుబడుతుంది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీ గ్రామాల్లోని మీ ఇంటి ముందు సాక్ష్యంగా ఉన్నది. కేసీఆర్ గారి అభ్యర్థులుగా మేము మీ కళ్ళ ముందే ఉన్నాము. మీ కష్ట సుఖాల్లో అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగే, కేసీఆర్ అభ్యర్ధిగా మేము కావాలా…! ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పి, ఎన్నికల తరువాత కనుమరుగయ్యే సీజనల్ నాయకులు కావాలో విజ్ఞులైన నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల స్ఫూర్తితో…. అభివృద్ధిలో సత్తుపల్లి నియోజవర్గాన్ని జిల్లా, రాష్ట్రం లోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశామని ఇది మనందరికీ గర్వకారణం అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat