తెలంగాణలో కాషాయనేతలు కమీషన్ల రాజాలుగా అవతారమెత్తారు..ఆ ఊరు, ఈ పట్టణం అనే తేడా లేదు..కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వసూళ్ల దందాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలో కొత్తగా అపార్ట్ మెంట్ లేదా ఇల్లు కడితే చాలు…కమీషన్ ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు..సదరు బిల్డర్ లేదా, ఇంటి యజమానులను వేధించి, బెదిరించి మరీ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అర్వింద్ గెలిచిన తర్వాత కాషాయ నేతలు రెచ్చిపోతున్నారు..అడ్డగోలుగా స్థానికులను బెదిరిస్తూ దర్జాగా వసూళ్ల దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందాపర్వం బయటపడింది. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సుక్కా మధు తన ఏరియాలో కొత్తగా ఇంటి నిర్మాణం చేస్తున్న ఓ వ్యక్తికి ఫోన్ చేసి మరీ డబ్బులు డిమాండ్ చేశారు. తాను అందరి మాదిరిగా కాదని, తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని సదరు కార్పొరేటర్ ఆ ఇంటియజమానిపై బెదిరింపులకు దిగాడు..బీజేపీ కార్పొరేటర్ ఫోన్ సంభాషణను.. ఆ ఇంటి యజమాని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. ఈ మ్యాటర్ ఇప్పుడు నిజామాబాద్ బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.