నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ .. సీనియర్ నటి రమ్యకృష్ణ హీరోయిన్ గా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కి శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన చిత్రం జైలర్ .. జైలర్ మూవీ రూ.600 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తమిళంలో ఈ మార్క్ అందుకున్న రెండో సినిమాగా జైలర్ నిలిచింది. తొలిస్థానంలో రోబో 2.o ఉంది.
రోబో సీక్వెల్ ఈ రికార్డును పది రోజుల్లో అందుకోగా.. జైలర్ 18రోజుల్లో సాధించింది. ఇక ఇప్పటికే పాత రికార్డులను తీసి మరీ రజనీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తెలుగులో దాదాపు పుష్కరం కాలం తర్వాత రజనీ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చింది.
టాలీవుడ్ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమాకు తీసుకురాని ప్రాఫిట్స్‌ను జైలర్ సినిమా తీసుకొచ్చింది. తెలుగులో ఈ సినిమా రూ.70 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను రాబట్టింది. ఇక కేరళ, కర్ణాటకలో రూ.50కు పైగా గ్రాస్‌ను సాధించింది.తమిళనాడు ఒక్క రాష్ట్రంలోనే రూ.200 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టి రజనీ మేనియా ఏంటో చాటి చెప్పింది.