ఏపీలో అటు వారాహి యాత్రలు చేస్తూనే..మరోవైపు సినిమాలు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఇటీవల పవర్ స్టార్ బ్రో సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా పవన్ మేనియా మాత్రం ఊపేసింది. ప్రజెంట్ పవన్ కల్యాణ్ లైనప్ లో హరహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరహరవీరమల్లు కు టైమ్ టేకింగ్ ఎక్కువ కావడంతో విరామం ఇచ్చిన పవన్ ఒకేసారి ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్ లను లాగించేస్తున్నాడు.
సాహో వంటి హాలీవుడ్ రేంజ్ మూవీ తిసిన సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీపై బీభత్సమైన బజ్ నెలకొంది. ఇప్పటికే ఒక్క ప్రీలుక్ పోస్టర్ తోనే వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేసిన ఘనత సుజిత్ కే దక్కింది. ప్రభాస్ సాహో సిన్మాతో అల్లాడించిన సుజిత్ డైరెక్షన్ లో పవర్ సునామీ లాంటి పవన్ కల్యాణ్ తో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పవచ్చు..సుజిత్ సైతం ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్. అసలు పవన్ కెరీర్ లోనే ది బెస్ట్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇక ఫైట్స్ అయితే టాలీవుడ్ హిస్టరీలోనే నెవ్వర్ భిఫోర్ అన్నట్లుగా ఉంటాయని టాక్. ఇక ఓజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు సుజిత్ గుడ్ న్యూస్ చెప్పాడు.
సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఓజీ టీజర్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నాడు సుజిత్..ఈ టీజర్ అర్జునదాస్ వాయిస్ ఓవర్ తో దాదాపు 72 సెకన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పంజా కాలం తర్వాత పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న చిత్రం కావడంతో ఓజీపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మోస్ట్ స్టైలిష్, యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తు్నారు. మొత్తంగా పవర్ స్టార్ బర్త్ డే రోజు ఓజీ టీజర్ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సునామీ క్రియేట్ చేస్తుందో చూడాలి…ఫ్యాన్స్ మాత్రం ఓజీ టీజర్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు.