Home / education / 14 రోజుల తర్వాత చంద్రుడిపై దిగిన ల్యాండర్‌, రోవర్‌ ఏమవుతాయి..?

14 రోజుల తర్వాత చంద్రుడిపై దిగిన ల్యాండర్‌, రోవర్‌ ఏమవుతాయి..?

చంద్రయాన్ – 3 సక్సెస్ తో భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు..కోట్లాది భారతీయులు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూశారు. చంద్రయాన్ – 3 విజయవంతం కావాలని పూజలు కూడా చేశారు..అంతా అనుకున్నట్లు జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ ల్యాండర్ సేఫ్ గా దిగడంతో భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు.చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ జాబిల్లి గుట్టు విప్పేందుకు ఇప్పటికే పరిశోధనలను ప్రారంభించాయి. అయితే వీటి జీవితకాలం కేవలం ఒక లూనార్ డే అంటే కేవలం 14 రోజులు మాత్రమే అని ఇస్రో ప్రకటించింది.

అసలు చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు అంటే భూమిపై సుమారుగా 29 రోజులతో సమానం. అంటే జాబిల్లి ఉపరితలంపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టు 23న చంద్రుడిపై పగలు మొదలైంది. ల్యాండర్‌ను సురక్షితంగా దించాలంటే సూర్యరశ్మి అవసరం. అందుకే సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసేందుకు ఇస్రో 23వ తేదీని ఎంచుకుంది. ఒకవేళ ఏదైనా కారణంగా ల్యాండింగ్‌లో సమస్య వస్తే పూర్తిగా సూర్యరశ్మి వచ్చిన తర్వాత… అంటే 24న ల్యాండ్‌ చేస్తామని ముందే ఇస్రో ప్రకటించింది. ల్యాండింగ్‌ వాయిదా వేయాల్సి వస్తే.. ఒక లూనార్‌ రోజు అనగా 29 రోజుల తర్వాత ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చేది. ఈ లెక్కన పగలు ఏర్పడిన మొదటి రోజు ల్యాండ్‌ చేస్తేనే పూర్తిగా 14 రో జులు పరిశోధనలు చేసేందుకు వీలవుతుంది.విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ పూర్తిగా సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి. జాబిల్లిపై రాత్రయితే సుమారు -180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అందుకే చంద్రుడిపై పగలు ఉండే 14 రోజులే వీటి జీవితకాలం అని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత రాత్రి అవగానే ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ల్యాండర్‌, రోవర్‌లోని వ్యవస్థలు పని చేయవు. ల్యాండర్‌, రోవర్‌లోని వ్యవస్థలు సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి కాబట్టి.. 14 రోజుల తర్వాత అవి పని చేయడం దాదాపుగా అసాధ్యం.

అయితే 14 రోజుల రాత్రి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే ల్యాండర్‌, రోవర్‌ తిరిగి పని చేసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతల కారణంగా ల్యాండర్‌, రోవర్‌ సూర్యరశ్మితో ఇంధనాన్ని తయారు చేసుకొని మళ్లీ పని చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే జరిగితే అవి మరో లూనార్‌ డే వరకు సేవలు అందిస్తాయి. అలా జరిగితే బోనస్‌గానే భావించాలి. కానీ ల్యాండర్‌, రోవర్‌ రెండూ పని చేస్తేనే భూమికి సమాచారం చేరుతుంది. రోవర్‌ నేరుగా భూమిపైకి సమాచారాన్ని పంపించలేదు. ఈ కారణంగానే రోవర్‌ పని చేసినా, ల్యాండర్‌ వ్యవస్థ కుప్పకూలిపోతే మిషన్‌ వృథా అవుతుంది. అదే సమయంలో ల్యాండర్‌ ఒకటే పని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. జాబిల్లి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ పరిశోధనలు చేసే రోవర్‌ పని చేయకపోయినా మిషన్‌ అక్కడితో ఆగిపోతుంది. సో…విక్రమ్ ల్యాండర్ తో పాటు ప్రజ్ఞాన్‌ రోవర్ చేసే పరిశోధనలు విజయవంతం కావాలని ఆశిద్దాం..మరి 14 రోజుల తర్వాత చంద్రుడిపై దిగిన ల్యాండర్, రోవర్ అలాగే పని చేయకుండా ‎ఉండిపోతాయా…లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat