నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యుగగళం పాదయాత్రం ఉమ్మడి క్రృష్ణా, గుంటూరు జిల్లాలో “కమ్మ”గా సాగుతోంది. కొడాలి నాని అడ్డా గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన లోకేష్ బూతులకు దిగారు. మా అమ్మను అసెంబ్లీకి లాగి, అవమానించిన వాడిని గుడ్డలూడదీసి, కట్ డ్రాయిర్ మీద గుడివాడ రోడ్ల మీద తిప్పుతా, ఉచ్చపోయిస్తా అంటూ మంగమ్మ శపథం చేశాడు. అయితే లోకేష్ కామెంట్లపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు.ఇక వైసీపీ సెటైర్ కింగ్ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా మాట్లాడుతూ..అసలు కట్ డ్రాయిర్ల మీద వీధుల్లో తిప్పే కోరిక లోకేష్ కు ఎందుకు వస్తుంది..ఏమైనా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటూ అదిరిపోయే పంచ్ వేశారు. నీకు అంతగా ఉచ్చ పోయించాలనే కోరిక ఉంటే..ఏదైనా సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని నువ్వు, మీ బాబు కలిసి టాయ్ లెట్ వ్యాపారం చేసుకోండి..కావాల్సిన అన్ని పర్మీషన్లు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామంటూ వీఎస్ ఆర్ కౌంటర్ వేశారు. ఇక వైసీపీ కార్యకర్తలైతే “లోకేష్ సులభ్ కాంప్లెక్స్…ఇక్కడ అందరికీ ఉచ్చపోయించబడును…తడిస్తే కట్ డ్రాయర్లు కూడా అమ్మబడును” అంటూ సెటైరికల్ పోస్టులు, మీమ్స్, కార్టూన్లతో లోకేష్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు.గతంలో లోకేష్ తియ్యగుంది..డైలాగ్ లాగే ఇప్పుడు ఉచ్చపోయిస్తా డైలాగ్ పై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతుందనే చెప్పాలి. లోకేష్ ఉచ్చపోయిస్తా డైలాగ్ కామెడీగా మారిపోవడంతో చినబాబు పవర్ ఫుల్ డైలాగులు వేసినా కామెడీ అవుతున్నాయేంట్రా అంటూ తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకున్నారు.
