అమ్మమ్మగారిల్లు అయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పాదయాత్ర “కమ్మ”గా సాగుతోంది.. తన సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో సహజంగానే కులగణం చినబాబు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతోంది. దీంతో లోకేశ్ బాబు తెగ రెచ్చిపోయి కట్ డ్రాయర్ల మీద తిప్పుతా…ఉచ్చపోయిస్తా అంటూ కొడాలినాని, వల్లభనేని వంశీలను ఉద్దేశిస్తూ డైలాగుల మీద డైలాగులు కొడుతున్నారు. పనిలో పనిగా కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ను కూడా వదల్లేదు..ఎవడో నిర్మాత రాంగోపాల్ వర్మ థర్డ్ గ్రేడ్ సినిమాలు తీస్తాడు..ఆ మహానుభావుడు సినిమాలు తీసేందుకు పర్మిషన్..ప్రజల తరపున పోరాడుతున్న లోకేశకు ఆంక్షలా…అంటూ వర్మను కెలికాడు…
అయితే తనకు కెలకపోయినా…నానా రచ్చ చేసే వర్మ డైరెక్ట్ గా తన పేరు పెట్టి కెలికితే ఊరుకుంటాడా..వెంటనే యూట్యూబ్ వేదికగా లోకేశ్ కు చెంప చెళ్లుమనిపించేలా కౌంటర్ ఇచ్చాడు. ” లోకేశ్ నేను థర్డ్ గ్రేడా…ఫిఫ్త్ గ్రేడా అన్నది ముఖ్యం కాదు..నా ప్రశ్న ఏంటంటే మా నాన్న ఎక్కడో చిన్న ఉద్యోగం చేసేవారు. అక్కడ నుంచి నాకు నేనుగా సినిమాల్లోకి వచ్చి డైరెక్షన్ చేశాను. హిట్లు తీశాను..సూపర్ ఫ్లాపులు కూడా తీశాను. మీరేమో చంద్రబాబు నాయుడు అనే పెద్ద నాయకుడికి పుట్టారు. అసలు ఆయన మిమ్మల్ని కనాలని అనుకోలేదు..కానీ మీరు పుట్టారు. దాన్నే బయాలజికల్ యాక్సిడెంట్ అంటారు.
అంటూ లోకేశ్ పుట్టుకపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ఇంత వరకు మీరేం సాధించారు..నేనేం సాధించాను అనేది పక్కపక్కన ఓ జాబితా తయారు చేసుకుని చూసుకోండి..అయినా నేను థర్డ్ గ్రేడ్ అయితే..మరి మీరేం గ్రేడో..మీ తండ్రిని పక్కనపెట్టేస్తే మీరు అరవడం తప్పిస్తే ఏం చేశారనేది నాకింత వరకు అర్థం కాలేదు..మీరు రాజకీయ నాయకులు..మీ ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో నాకు తెలియదు..ప్రతి రోజు వందల సినిమా షూటింగ్స్ జరుగుతాయి…నాకొక్కరికే కాదు..అందరికీ షూటింగ్స్ కు అనుమతి ఇస్తారు. షూటింగ్ పర్మిషన్కి, మీటింగ్ పర్మిషన్ కు మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదంటూ వర్మ లోకేశ్‌కి చురకలు అంటించారు.
అసలు మీరు తెలియక మాట్లాడతారా..జనాలకు తెలియదని మాట్లాడుతారా..జనాలు పట్టించుకోరని మాట్లాడుతారా..కొందరు ఆడియన్స్‌ని టార్గెట్ చేసి మాట్లాడుతారా..? మీరు ఓ వ్యూహం ప్రకారం మాట్లాడితే నాకు ఎలాంటి సమస్యా లేదు..మీరు అబద్ధం చెప్పినా..చెప్పాలనుకున్నా ఓ ఎజెండా ఉందనుకుంటే పర్వాలేదు..అలా కాకుండా మీరు ఏదేదో మాట్లాడితే…మీకంటూ గుర్తింపు లేదని, తండ్రికి తగ్గ కొడుకుని కాదేమోనన్న అభద్రతాభావంలో ఉన్నారనిపిస్తోంది..మీకు నిజంగా ఈ సమస్య ఉంటే..సైకియాట్రిస్ట్ కు చూపించుకుంటే మంచిది..ఇదే నేను మీకిచ్చే సలహా అంటూ ఆర్జీవి సుతిమెత్తగా నారాలోకేశ్ కు కౌంటర్ ఇచ్చారు…మొత్తంగా చంద్రబాబు నిన్ను కనాలనుకోలేదు..నువ్వే బయాలజికల్ యాక్సిడెంటల్ గా పుట్టావు అంటూ నారా లోకేశ్ కు ఆర్జీవి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.