తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులు తమ తమ బయోడేటాతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఆ పార్టీ ఆధిష్టానం నిర్ణయించిన సంగతి తెల్సిందే.
అందులో భాగంగా ఈరోజు దరఖాస్తులకు చివరి తేది కావడంతో ఆశావాహులు భారీగా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ నుండి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోదాడ నుండి ఆయన సతీమణి పద్మావతి బరిలోకి దిగనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఇందుకుగానూ గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.