మీరు విన్నది నిజమే… నందమూరి వారి ఆడబిడ్డ, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరీ పరువును స్వయానా ఆమె భర్త..40 ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆమె సుపుత్రుడు నారాలోకేశ్ తీస్తున్నారా..బహిరంగ వేదికలపై తండ్రీ కొడుకుల మాటలు వింటే..భువనేశ్వరీ పరువును అడ్డంగా రోడ్డున పడేస్తున్నారని అనుమానం రాక తప్పదు..గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ కాస్తా శ్రుతిమించారు. భువనేశ్వరీ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో తన భార్యను అవమానించారంటూ స్వయంగా చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. కాగా భువనేశ్వరీపై వంశీ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఈనేపథ్యంలో పశ్చాతాప్తం వ్యక్తం చేసిన వంశీ..నారా భువనేశ్వరీ టీడీపీలో అందరికంటే నాకు ఆత్మీయురాలు..ఆమెను అక్కా అని పిలుస్తా.. ఎమోషన్ లో పొరపాటున వ్యాఖ్యలు చేశానని అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు.
అంతటితో వివాదానికి పుల్ స్టాప్ పడినా…నారా తండ్రీ కొడుకులు మాత్రం సానుభూతి ఓట్ల కోసం బహిరంగ వేదికలపై ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ నందమూరి వారి బిడ్డ భువనేశ్వరీ పరువు మరింత బజారున పడేలా చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా మహిళలతో రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు పెట్టించి…భువనేశ్వరీని అవమానించిన వైసీపీ నేతల తీరును ఖండిస్తూ…ప్రజల్లో ఆమెని మరింత పలుచన చేసారు..ఇక నారా లోకేష్ అయితే పలుమార్లు బహిరంగ సభలలో , రోడ్ షోలలో నా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టేది లేదంటూ…తీవ్ర స్వరంతో వార్నింగ్ లు ఇస్తూ ప్రజల్లో అసలేం జరిగిందనే తీరుగా అనుమానాలు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు.
అసలు బుద్ధి, జ్ఞానం ఉన్న వాడెవ్వడైనా ఇలాంటి సున్నితమైన విషయాలకు అంతటితో పుల్ స్టాప్ పెడతారు..కానీ వంశీ క్షమాపణలు చెప్పినా…అంతటితో ఆగకుండా…ఓట్ల కోసం..సానుభూతి కోసం మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం… నా తల్లిని అవమానించినవారిని వదిలిపెట్టను…ఉచ్చపోయిస్తా.,కట్ డ్రాయర్ల మీద తిప్పుతా అంటూ తండ్రీకొడుకులు పదేపదే నందమూరి వారి బిడ్డ పరువు తీస్తున్నారు..అయ్యా బాలయ్య….కొంచెం బుర్ర వాడయ్యా..మీ అక్క పరువును స్వయాన మీ బావ, మేనల్లుడే ఇలా బజారున పెడుతుంటే ఏం చేస్తున్నావయ్యా అంటూ నందమూరి అభిమానులు వాపోతున్నారు. అయినా మన పిచ్చి కానీ…తండ్రిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుని ఆయన చావుకు కారణమైన బావ చంద్రబాబుకు, తండ్రి మాటల మీద తెలివిగా తన బిడ్డను పెళ్లి చేసుకుని, సీఎం కుర్చీని తనకు, నందమూరి వారసులు అయిన జూనియర్ ఎన్టీఆర్ కు కాకుండా చేసిన అల్లుడు లోకేష్ కు ఎదురుచెప్పే ధైర్యం బాలయ్యకు ఉందా అని మరి కొందరు నిఖార్సైన నందమూరి ఆభిమానులు అంటున్నారు. మొత్తంగా వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా వివాదానికి పుల్ స్టాప్ పెట్టకుండా..పదే పదే తన తల్లిని అవమానించిన వారికి ఉచ్చపోయిస్తా అంటూ లోకేష్ స్వయంగా నందమూరి వారి ఆడబిడ్డ పరువు తీస్తున్నారనడంలో సందేహం లేదు.