నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే..పాపం సొంతపుత్రుడు లోకేశ్ పాదయాత్రను జాకీలు పెట్టి లేపేందుకు చంద్రబాబు, టీడీపీ అనుకుల మీడియా పెద్దలు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో పెద్ద స్పందన రావడం లేదు..అప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో బయటకు వస్తే తన కొడుకు లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోరని చంద్రబాబు భయపడినట్లు ఉన్నారు. కొన్నాళ‌్లు సినిమాలు చేసుకుని ఆ తర్వాత యాత్ర స్టార్ట్ చేయమని, ఈ లోపు లోకేశ్ పాదయాత్రకు మాంచి ఊపు తెస్తామని దత్తపుత్రుడిని పవన్ కల్యాణ్ ని బతిమాలుకుని వారాహియాత్రను వాయిదా వేయించాడు..పాపం వపన్ కల్యాణ్ ప్యాకేజీ విశ్వాసంతో బాబోరు చెప్పినట్లు కొన్నాళ్లు వారాహియాత్రను వాయిదా వేసుకుని ఈ మధ్యే స్టార్ట్ చేశాడు.బాబుగారు భయపడ్డట్లే అయింది..పవన్ వారాహియాత్ర స్టార్ట్ అయ్యాక…లోకేష్ పాదయాత్ర సోదిలో లేకుండా పోయింది…అయితే చినబాబు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా అర్థరాత్రులు సైతం పాదయాత్రలు చేస్తూ తెగ హడావుడి చేస్తున్నారు.పాపం తెలుగు తమ్ముళ్లు అర్థరాత్రి పాదయాత్రలేంట్రా బాబు అంటూ తిట్టుకుంటూనే…చినబాబు కోసం రోడ్డ మీదకు పోతున్నారు.
అయితే తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయ్ దేవ్ సైతం అర్థరాత్రి పాదయాత్రలేంటీ..మతిపోయిందా ఏంటీ అంటూ ఓ రేంజ్ లో లోకేశ్ ను వేసుకున్నారు. యువగళం పాదయాత్రపై తనకు నమ్మకం లేకనే తాను వెళ్లలేదంటూ బాంబు పేల్చారు. నారాలోకేష్ పాదయాత్ర వల్ల పార్టీకి పెద్దగా ఒరిగిందేం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ను ఏపీ ప్రజు నమ్మడం లేదని.. ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం శూన్యం. అందుకే యువగళం పాదయాత్రకు వెళ్లలేదంటూ స్పష్టం చేశారు. అర్థరాత్రి దాటాకా పాదయాత్రలేంటీ..పార్టీలో కొందరు మతిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ పరోక్షంగా లోకేష్ పై విరుచుకుపడ్డారు. ఇకనైనా పద్దతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనని టీడీపీ అధిష్టానానికి హితవు పలికారు. ముందుగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తేనే..ఇప్పటి నుంచి పని చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు…కాగా నారా లోకేష్ పాదయాత్ర గతవారం నుంచి ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో జరిగింది. అయితే గుంటూరు పార్లమెంట్ పరిధిలో జరిగిన పాదయాత్రకు ఎంపీ గల్లా జయదేవ్ దూరంగా ఉన్నారు. దీంతో ఎంపీ యువగళంలో ఎందుకు పాల్గొనలేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సైతం పాదయాత్రకు వెళ్లలేదు.. హైదరాబాద్‌లో ఉన్న ఆయన విజయవాడలో పాదయాత్ర జరిగిన సమయంలో అటువైపే వెళ్లలేదు. నాని కుమార్తె శ్వేత కూడా యువగళంకు హాజరుకాలేదని చెబుతున్నారు. మొత్తంగా లోకేష్ పాదయాత్రల వల్ల పార్టీకి ఒరిగిందేం లేదని..అసలు అర్థరాత్రి పాదయాత్రలేంటీ..మతిపోయిందా అంటూ స్వయంగా ఎంపీ గల్లాజయదేవ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.