శ్రావణమాసం అంతటా పవిత్రమైనది..ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాలతో పాటు, వరలక్ష్మీ వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం జరుపుకోవడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ నెల అంతటా అన్ని శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. మహిళలు తమ సౌభాగ్యం కలకాలం ఉండేలా వరం ఇవ్వమంటూ వేడుకుంటూ వరలక్ష్మీదేవి వ్రతాన్ని పరమనిష్గగా జరుపుకుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలోని వరలక్ష్మి దేవి వ్రతం రోజున ఉదయాన్నే నిద్ర లేచి మహిళలు స్నానాలు ముగించాలి. అనంతరం ఆవు పేడ నీళ్లతో కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. పూజగదిని శుభ్రం చేసుకొని వరలక్ష్మి దేవి రూపుని ప్రతిష్టించుకోవాలి. ఉదయాన్నే కలశం ఏర్పాటు చేసుకొని పూజను ప్రారంభించాలి. . వరలక్ష్మి దేవికి ఇష్టమైనటువంటి నైవేద్యం పాలతో చేసిన పొంగలి, పులిహార దద్దోజనం వంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవి వ్రతం ఎంతో నిష్టతో జరుపుకోవాలని పండితులు చెబుతుంటారు. అయితే ఒక్కోసారి తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.. కానీ తెలిసి పొరపాట్లు జరిగితే మాత్రం మహాపరాధంగా చెబుతున్నారు. తెలిసీ ఈ తప్పులు చేస్తే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోయి..కటిక దరిద్రం రాజ్యమేలుతుందని..పండితులు చెబుతున్నారు..కావున ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా, నిష్టగా వరలక్ష్మీ వ్రతం చేస్తే శ్రీ లక్ష్మీ దేవి అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలకు , ఆయురారోగ్యాలకు లోటుండదు.
* శ్రావణమాసంలో వరలక్ష్మీ దేవి వ్రతం రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు..
ఆడవారే కాదు..ఇంట్లో మగవారు కూడా తినకూడదు.
* అలాగే ఈ రోజున భార్యాభర్తలు శారీరకంగా దూరంగా ఉండాలి
* అలాగే ఇంట్లో ఎవరూ మద్యం సేవించకూడదు
* వరలక్ష్మి దేవి వ్రతం రోజున తులసీ చెట్టుకు కూడా పూజ చేస్తుంటారు..కానీ ఎట్టి పరిస్థితుల్లో
తులసీ చెట్టును తాకకూడదు. తులసీ మొక్క లక్ష్మీదేవితో సమానం…తులసీ చెట్టును
తాకితే లక్ష్మీదేవిని తాకినట్లే..అది మహాపరాధం..
* వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటి ముందుకు వచ్చిన ఆవును ఆకలితో పంపకూడదు.