ముసలితనంలో కొంత మందికి చాదస్తం పెరుగుతోంది..మేం వయసులో ఉన్నప్పుడు అలా చేశాం..ఇలా చేశాం..ఇప్పటికీ మేం తోపులం అని పదే పదే చెప్పి చుట్టుపక్కల మందిని చావగొడుతుంటారు.. ఒకరకమైన ఇల్యూజన్ తో బాధపడుతుంటారు..సేమ్ టు సేమ్ మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు గారి వరస చూస్తుంటే బుర్రలో ఏమైనా చిప్ దొబ్బిందా అనే డౌట్ రాకమానదు..ఇటు సొంత పుత్రుడు పాదయాత్ర, అటు దత్తపుత్రుడి వారాహియాత్రలు ఎన్ని చేస్తున్నా..గెలుపుపై నమ్మకం 70 ఏళ్ల ముదిమి వయసులో రోడ్ షోలు చేస్తూ జగన్ పై నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. అయితే వయసు ప్రభావమో..ఏమో కానీ…ఎక్కడకు వెళ్లినా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ…మతిలేని వ్యాఖ్యలు చేస్తూ తన పరువు తానే తీసుకుంటున్నారు..
రాఖీ పండుగ రాబోతుంది కదా…రాఖీ వ్రతం చేయమని .శ్రీశ్రీశ్రీ చంద్ర బాబాజీ మహిళలకు సెలవిచ్చారు.మహిళలకు రాఖీ ఇస్తానని, దాన్ని 45 రోజుల పాటు పూజించి, చేతికి కట్టుకుని, కష్ట సమయంలో తనను తలచుకుంటే భగవత్ సంకల్పానికి తోడుంటానని చంద్రబాబు చెప్పారంటే తనను తాను దైవాంశ సంభూతుడిగా ఫీల్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు…ఇక బాబుగారి విజన్ 2020 అంటే యావత్ ప్రపంచానికే వణుకు పుడుతోంది..విజన్ 2020 తో బాబుగారు ఒరగబెట్టిందేమో కానీ…2020 లో కరోనా వచ్చి లక్షలాది మందిని బలితీసుకున్న ఘటన గుర్తుకు వచ్చి తెలుగు ప్రజలు నిద్రలో కూడా ఉలిక్కిపడుతుంటారు.. ఇప్పుడు కొత్తగా విజన్ 2047 అంటూ బాబోరు వైజాగ్ వేదికగా మరో బాంబు పేల్చారు…2047 విజన్ తో దేశాన్నే మార్చేస్తారంట…ముందు ఏపీలో ఈసారి గెలవకుంటే…ఇక పర్మినెంట్ గా టీడీపీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే..ఈ విషయాన్ని మర్చిపోయి 2047 పేరుతో విజనరీ అంటూ పచ్చమీడియాలో డప్పుకొట్టించుకుంటున్నారు…
అదే వైజాగ్ లో మరో ఆణిముత్యంలాంటి డైలాగ్ వదిలారు. బికామ్ లో ఫిజిక్స్ అంటూ తన శిష్యుడు జలీల్ ఖాన్ పొలిటికల్ కమేడియన్ గా మారితే తానేమి తక్కువ అన్నట్లుగా బీటెక్ లో బైపీసీ అంటూ అదిరిపోయే డైలాగ్ వదిలి…సినిమాల్లో కామెడీ కింగ్ బ్రహ్మానందం అయితే పాలిటిక్స్ లో తానే కామెడీ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు. రోడ్ షోలో అర్థరాత్రి మరో అద్భుతమైన డైలాగ్ వేసేశారు. తమ్ముళ్లు…మీ సెల్ ఫోన్ లొ టార్చ్ లైట్లు వెలిగించండి…అని బతిమాలుకుని వెలిగించిన తర్వాత..ఆకాశంలో చుక్కల్లా కనిపిస్తున్నాయి…ఇంత అద్భుతమైన టెక్నాలజీ సృష్టించిన ఘనత నాదే అంటూ మళ్లీ స్వకుచ మర్దనం చేసుకున్నారు..అంతే సెల్ ఫోన్ లైట్ల వెలుగులో తెలుగు తమ్ముళ్ల ముఖాలు దెబ్బకు మాడిపోయాయి.
బాబుగారి పిచ్చికి మరో పరాకాష్ట…9 లీటర్ల నీటితో కిలో కరెంట్ ఉత్పత్తి చేయచ్చు..ఈఒక్కడైలాగ్ తో అక్కడున్న వాళ‌్లంతా రెండు చేతులు జేబులో పెట్టుకుని పైలెంట్ గా జంప్ అయ్యారంట…ఇవన్నీ జస్ట్ శాంపిల్ మాత్రమే..పాపం అనుకుల మీడియాతో ఎంత బద్నాం చేసినా…ప్రజల్లో జగన్ పై అభిమానం చెక్కుచెదరడం లేదు…పైగా పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో బాబుగారిలో ఫ్రస్టేషన్ పీక్స్ కు వెళ్లిందనుకుంటా…నో డౌట్ బాబుగారి చిన్నమైండ్ లో చిప్ దొబ్బిందేమో …అందుకే ఇలా రోజుకో పిచ్చి డైలాగులతో ప్రజలను చావగొడుతున్నారు.. ..ఆయన్ని అర్జెంట్ గా ఎర్రగడ్డకు పంపించాల్సిందే అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు.