కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని జగద్గిరి నగర్ లో రూ.43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భడ్రైనేజీ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బస్తీలను అభివృద్ధిలో ముందుంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యేక్షులు రుద్రా అశోక్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సయెద్ రషీద్, అతిరి మారయ్య, వేణు యాదవ్, బాబు గౌడ్, , అజాం, వెంకటేశ్వర్లు, బీర చారీ, సాజీద్, వెంకటేష్, లక్సయ్య, మహిళా నాయకులూ ఇంద్ర గౌడ్, హైమావతి, మరియు తదితరులు పాల్గొన్నారు.