Home / ANDHRAPRADESH / కుప్పం ఇక బాబోరికి ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారింటికి షిఫ్ట్ అవ్వాల్సిందేనా..?

కుప్పం ఇక బాబోరికి ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారింటికి షిఫ్ట్ అవ్వాల్సిందేనా..?

టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఆప్పటికీ చంద్రబాబు కుప్పంలో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడంతో బాబుగారికి దిమ్మతిరిగిపోయింది. జగన్ దెబ్బకు దిగివచ్చిన చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు రెడీ అయిపోయారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందనే భయంతో చంద్రబాబు కుప్పంపై ఫోకస్ పెట్టడం మొదలెట్టారు.

అయితే తాజాగా కుప్పం ప్రజలు మరోసారి బాబుగారికి షాక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది. ఈ క్రమంలో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఆరు వార్డుల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ్గా, కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క చోటే టీడీపీ మ‌ద్ద‌తుదారు గెలుపొందారు. వైసీపీ నాలుగు చోట్ల గెలుపొంద‌గా, ఒక స్థానాన్ని ఏక‌గ్రీవం చేసుకోవ‌డం విశేషం. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని గుడుప‌ల్లె మండ‌ల ప‌రిధిలోని పెద్ద‌బ‌దిన‌వాడ పంచాయ‌తీలోని నాల్గో వార్డులో టీడీపీ మ‌ద్ద‌తుదారు గెలుపొందారు. ఇదే పంచాయ‌తీలో మ‌రో వార్డులో వైసీపీ అభ్య‌ర్థి ఏక‌గ్రీవ‌మ‌య్యారు. అలాగే వి.కోట మండ‌ల ప‌రిధిలోని కొంగ‌టం పంచాయ‌తీ ప‌డిగ‌ల‌కుప్పం వార్డులో వైసీపీ అభ్య‌ర్థి గెలుపొంతారు. ఇక్క‌డ ఇద్ద‌రూ వైసీపీ మ‌ద్ద‌తుదారులే త‌ల‌ప‌డ‌డం విశేషం. శాంతిపురం మండ‌లం క‌డ‌ప‌ల్లె పంచాయ‌తీలో 10వ వార్డులోనూ, అలాగే అదే మండ‌లం మ‌ఠం పంచాయ‌తీలోని ప‌దో వార్డులోనూ వైసీపీ మ‌ద్ద‌తుదారులు గెలుపొందారు. ఇదిలా వుండ‌గా చంద్ర‌బాబు ఇల్లు క‌ట్టుకుంటున్న క‌డ‌ప‌ల్లె పంచాయ‌తీలో కూడా వైసీపీ మ‌ద్ద‌తుదారే గెల‌వ‌డం విశేషం.

సార్వత్రిక ఎన్నికలకు మరి కొద్ది నెలల్లో సమయం ఉందనగా…రాష్ట్రవ్యాప్తంగా వైసీపీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న వేళ..చంద్రబాబు సొంత గడ్డపై మళ్లీ వైసీపీ జెండా ఎగరడం అది కూడా గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సొంత పుత్రుడు లోకేష్ పాదయాత్రలు చేసినా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహియాత్రలు చేసినా..క్షేత్రస్థాయిలో సీఎం జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని, పట్టణ ఓటర్లలో కాస్త ప్రతికూలత ఉన్నా…ఎన్నికల గెలుపు ఓటములను శాసించే గ్రామాల్లో వైసీపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఈ ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అది కూడా కుప్పం గ్రామపంచాయతీల్లో వైసీపీ గెలుపు ఓ రకంగా చంద్రబాబుకు ప్రమాద సంకేతాలు పంపించినట్లే అని చెప్పాలి. దీన్ని బట్టి జగన్, పెద్దిరెడ్డి కుప్పంపై ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి.

ఇక బాబోరికి కుప్పం ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారిల్లు అయిన కృష్ణా జిల్లాకో, గుంటూరు జిల్లాకో షిఫ్ట్ అవక తప్పదని…లేకుంటే అమరావతి ప్రాంతంలోని ఏదైనా నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటే బెటరని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు….ఒక వేళ కుప్పం నుంచి పారిపోయాడనే అపవాదు వస్తుందనే భయంతో అక్కడే పోటీ చేసినా…సేఫ్ సైడ్ గా రాష్ట్రంలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మంచింది. లేకుంటే మంగళగిరిలో లోకేష్ కు పట్టిన గతే..కుప్పంలో బాబుగారికి పట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat