Home / SLIDER / అన్ని వర్గాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం-మంత్రి కొప్పుల ఈశ్వర్

అన్ని వర్గాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం-మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉందని రాష్ర్ట ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం పథకాన్ని శనివారం నాడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం 15 వేల క ట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 22 వందల కోట్ల రూపాయల నిధులు బడ్జెట్ లో కేటాయించి.. ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ నిధుల నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ కు 270 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లక్ష్ది దారుడికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నామని.. రాష్ర్ట వ్యాప్తంగా 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇవాళ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున వంద కోట్లు అందిస్తున్నామని తెలిపారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎలాంటి అల్లర్లు, అలజడి లేకుండా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా జనరంజకంగా పాలన కొనసాగుతుందని మంత్రి చెప్పారు. జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని అన్నారు. గతంలో మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకు దూరంగా ఉండే పరిస్థితి ఉండేదని.. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంలో ఆ పరిస్థితి లేదన్నారు. 204 మైనార్టీ గురుకల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికి విద్య అందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. లక్షకు పైగా విద్యార్ధులకు పూర్తిగా ఉచితంగా విద్య అందుతుందని అన్నారు.

మానవీయ కోణంలో సీం కేసార్ ఆలేచన చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిరుపేద మానార్టీ విద్యార్ధులు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద ఒక్కోమైనార్టీ విద్యార్ధికి 20 లక్షలకు పైగా ఇస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే ఒంటరి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పెన్షన్ ఇస్తుందన్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తూ మైనార్టీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని.. ఇది దేశానికే ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహామూద్ అలీ, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బీన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేష్, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు, మైనార్టీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, హజ్ కమిటీ చైర్మన్ తారిక్ అన్సారీ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసివుల్లా ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమర్ జలీల్, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat