బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారి అధ్వర్యంలో బీజేపీ పార్టీను వీడి బీఆర్‌ఎస్ పార్టీ లోకి చేరిన బీర్కూరు మండల నాయకులు, కార్యకర్తలు.బీర్కుర్ మండల కిష్టాపూర్ గ్రామస్తులు బీజేపీ కిసాన్ మోర్చ మండల ఉపాధ్యక్షులు అట్కరి కృష్ణా,బీజేపీ బూత్ అధ్యక్షులు & మున్నూరు కాపు యూత్ అధ్యక్షులు కల్ల సాయి కుమార్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాచబోయిన అత్మారామ్ గార్లు మరియు సుమారు 50 మందికి ఈ సంధర్బంగా పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన పోచారం భాస్కర్ రెడ్డి గారు.
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాయని, బీఆర్‌ఎస్ పార్టీతోనే పేదలకు మేలు జరుగుతుందని సీఎం శ్రీ కేసీఆర్ గారు,స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము బీఆర్‌ఎస్ పార్టీ లో పెద్ద ఎత్తున చేరుతున్నామని తెలిపారు.ఈ సదర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ …తమను నమ్మి వచ్చిన కార్యకర్తలను ఎల్లవేళల కంటికి రెప్పలా కాపాడుకుంటామని వారికి ఆన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ విధానం మూడు గంటల కరెంటు.. బీఆర్ఎస్ విధానం మూడు పంటలకు కరెంటు అని అన్నారు. అధికారంలోకి రాకముందే రైతు వ్యతిరేక విధానాలు ప్రవేశపెడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, బిజెపికి బుద్ధి చెప్పాలని, రైతు బాంధవుడైన సీఎం కెసిఆర్ గారిని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీర్కుర్ మండల ఎంపీపీ రఘు గారు,యూత్ అధ్యక్షులు శశి కాంత్ గారు, కిష్టాపుర్ సర్పంచ్ బాబురావు గారు,అన్నారం సర్పంచ్ కృష్ణా రెడ్డి గారు, కిష్టాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, బీర్కుర్ పట్టణ పార్టీ అధ్యక్షులు రాజు మరియు బాన్సువాడ పట్టణ నాయకులు
ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.