హిందూపురం నియోజవర్గం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పీఏల ఓవరాక్షన్ గురించి అందరికి తెలిసిందే. గత ఎన్నికల ముందు బాలయ్య పేరుతో ఆయన పీఏలు చేసిన వసూళ్ల పర్వం, అవినీతి దందాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు…ఓ దశలో బాలయ్య సైతం పీఏలను అదుపులోకి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గాన్ని బాలయ్య కంటే ఆయన పీఏలే శాసించిన పరిస్థితి. అయితే వైసీపీలో వర్గ విబేధాలతో గత ఎన్నికల్లో బాలయ్య గట్టెక్కాడు. దీంతో బాలయ్య పీఏలు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పీఏ కమ్ టీడీపీ లీడర్ అయిన శ్రీనివాస్ రావు పోలీసులపై రెచ్చిపోయాడు. శనివారం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద శ్రీనివాస్ రావు తన అనుచరులతో కలిసి హల్ చల్ చేశాడు. పోలింగ్ సరళిని తాను పరిశీలించాలంటూ అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి చొరబడే ప్రయత్నం చేశాడు. అయితే ఇందుకు రూల్స్ ఒప్పుకోవంటూ పోలీసులు శ్రీనివాస్ రావును అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వివాదానికి దిగిన శ్రీనివాస్ రావు తన అనుచరులతో కలిసి పోలీసులపై దౌర్జన్యానికి దిగాడు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో పోలీసులు దౌర్జన్యకారులను చెదరగొట్టి బాలయ్య పీఏని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా బాలయ్య పీఏ ఓవరాక్షన్ హిందూపురంలో హాట్ టాపిక్ గా మారింది.
