తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులను మమేకం చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
నెలలో ప్రతి మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థల్లో పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ (పీటీఎం)ను నిర్వహిస్తామని ట్విట్టర్ వేదికగా తెలంగాణ విద్యాశాఖ తెలిపింది.
పిల్లల ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర గురించి సరైన అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వాములను చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించింది. అయితే పిల్లల అటెండెన్స్ ,వారి దినదిన పురోగతిపై తల్లిదండ్రులు పోషించాల్సిన పాత్ర గురించి కూడా ఆ సమావేశంలో చర్చిస్తారు.