బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారింది. కేసిఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారింది. అందుకే అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అవుతుందని జనం బలంగా నమ్ముతున్నారు.
ఈ నమ్మకంతోనే నేడు నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలోని బిజెపి పార్టీకి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, గ్రామ పార్టీ ఉపాదక్ష్యులు బాలా సురేశ్, యూత్ ఉపాదక్ష్యులు సింగారపు వేణు, కార్యదర్శి సింగారపు శ్రీనివాస్, గ్రామపార్టీ కోశాధికారి రుద్రారపు రాంరాజ్ లతో పాటు పలువురు కార్యకర్తల కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
అదేవిధంగా వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు కొలిపాక వెంకన్న, జొన్నలగడ్డ మోహన్, దుర్గం వెంకన్న, కొత్తపల్లి పరిపూర్ణాచారి, సింగం అనిల్, కాయిత సురేష్, రాము, సింగం అజయ్, అజిత్, అనిల్ లతో పలువురు కార్యకర్తల కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరడం జరిగింది.- నూతనంగా పార్టీలోకి చేరిన వారికి గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పార్టీ అధ్యక్షులు, చెన్నరావుపేట మాజీ ఎంపిపి, గ్రామ ముఖ్య నాయకులు, క్లస్టర్ భాద్యులు, తదితరులు పాల్గొన్నారు..