తెలంగాణలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మొదలయ్యాయి. మాజీ ఎంపీ,కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళం నెలకొన్నది.
అదిష్టానం మేల్కోని చర్యలు తీసుకుంటే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టిమునగడం ఖాయం అని అన్నారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కోన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి మోసాన్ని గుర్తించి భద్రాచలం ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ లో చేరారని ఆయన తెలిపారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరేనాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నప్పటికి పొంగులేటి చేరడంతో ప్రతి నియోజకవర్గంలో వర్గ విబేధాలు మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ టికెట్ ఆశించడంలో తప్పు లేదు కానీ జారే ఆదినారాయణ పార్టీ టికెట్ తనదేనని.. తాటికి టికెట్ రాదని ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.