ఏపీలో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అగ్రనేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న వల్లభనేని వంశీ కాన్వాయ్ సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే వంశీ ప్రయాణిస్తున్న వాహనం ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. అయితే ఈ ప్రమాదం నుంచి వల్లభనేని వంశీ సురక్షితంగా బయటపడడంతో ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
