ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ మధ్య ఎక్కడకెళ్లిన ఏ సభకు వెళ్లిన అన్ని తానే కనిపెట్టినట్లు.. అన్నింటికి తానే కారణం అన్నట్లు మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని చెబుతూ తన మేధావితనాన్ని బయట పెట్టుకున్నాడు బాబు.
తాజాగా మరోసారి అడ్డంగా బుక్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం బాబు కొనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు జల్లు కురిపించారు. ఆ క్రమంలోనే బాబు మాట్లాడుతూ” తమకు అనుకూలంగా అందరూ తమ తమ మొబైల్ ఫోన్ టార్చ్ లైట్లను ఆన్ చేయాలని అక్కడ ఉన్నవారిని కోరారు చంద్రబాబు.
దీంతో అక్కడున్న వారంతా ప్లాష్ లైట్లను ఆన్ చేశారు. దీన్ని ఉద్ధేశిస్తూ బాబు మాట్లాడుతూ అందరూ ముబైల్ ఫోన్ టార్చ్ లైట్లు ఆన్ చేస్తే ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నట్లు మన మొబైల్ ఫోన్స్ మెరుస్తున్నాయి. దీనికి కారణం టెక్నాలజీ.. ఈ టెక్నాలజీ వల్లనే టార్చ్ లైట్ వచ్చింది. ఆ టార్చ్ లైట్ రావడానికినేనే కారణం అని “అన్నారు.