Home / SLIDER / పొంగులేటికి భారీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య అనుచరులు…త్వరలో బీఆర్ఎస్ లో చేరిక…!

పొంగులేటికి భారీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య అనుచరులు…త్వరలో బీఆర్ఎస్ లో చేరిక…!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విబేధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ లో కలహాల కుంపట్లు ముదిరిపోయాయి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏకమై పార్టీలో మోస్ట్ సీనియర్ అయిన తన అడ్డు తొలగించుకునే కుట్ర చేస్తున్నారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీ రేణుకా చౌదరి వర్గం కూడా పార్టీలో మోనార్క్ లా వ్యవహరిస్తున్న పొంగులేటి తీరుపై మండిపడుతోంది. తనకున్న ధనబలం, వర్గంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపిస్తానంటూ ..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కనివ్వను అంటూ పొంగులేటి శపథాల మీద శపథాలు చేస్తున్నారు. అంతే కాదు ఉమ్మడి జిల్లాలో మెజారిటీ సీట్లు తన వర్గానికే దక్కేలా రేవంత్ రెడ్డి ద్వారా పొంగులేటి పావులు కదుపుతున్నారు. అయితే జిల్లాలో పొంగులేటికి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ముఖ్య అనుచరులు ఇద్దరూ మంత్రి పువ్వాడ అజయ్ తో టచ్ లోకి వెళ్లడం జిల్లాలో సంచలనంగా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ నుంచి పోటీ చేయడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై బీఆర్ఎస్ పార్టీ నజర్ పెట్టింది. ఈ క్రమంలో భద్రాచలం పట్టణంలో పొంగులేటి ముఖ్య అనుచరుడైన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కారెక్కడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన తెల్లం వెంకట్రావు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ఆర్ సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం పొంగులేటితో కలిసి గులాబీ పార్టీలో చేరారు. పొంగులేటి ముఖ్య అనుచరుల్లో ఒకరిగా కొనసాగుతున్న వెంకట్రావు ఇటీవల ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈసారి భద్రాచలం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని వెంకట్రావు భావించారు. ఇదిలా ఉంటే భద్రాచలం అసెంబ్లీ సీటు ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ డీసీసీ ప్రెసిడెంట్ అయిన పోడెం వీరయ్యకే దక్కుతుందని తెలియడంతో వెంకట్రావు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాల మేరకు పువ్వాడ అజయ్ రంగంలోకి దిగారు. తనకు టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో వెంకట్రావు సైతం వెంటనే పువ్వాడతో టచ్ లోకి వెళ్లారు. బీఆర్ఎస్ లో చేరితే భద్రాచలం అసెంబ్లీ టికెట్ హామీ ఇవ్వాలని వెంకట్రావు  కోరినట్లు తెలుస్తోంది. సూత్రపాయంగా అంగీకరించిన పువ్వాడ వెంటనే తెల్లం వెంకట్రావును వెంటపెట్టుకుని మంత్రి హరీష్ రావును, సీఎం కేసీఆర్ ను సైతం కలిసినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వెంకట్రావు బాటలో పొంగులేటి ముఖ్య అనుచరులైన మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సైతం బీఆర్ఎస్ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పొంగులేటి ఒంటెద్దు పోకడలను, నియంత ధోరణి భరించలేక మరి కొంత మంది ముఖ్య అనుచరులు సైతం బీఆర్ఎస్ బాట పట్టే అవకాశం ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతోంది. మొత్తంగా వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకు ఎదురులేదన్నట్లుగా అతి చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు ముఖ్య అనుచరులు షాక్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి మున్ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ రాజకీయ చాణక్యాన్ని పొంగులేటి అండ్ కో ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat