తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపారు. ఇందులో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను ముప్పై ఏడు శాతం పెంచుతూ విద్యుత్ శాఖకు సంబంధించిన స్పెషల్ సీఎస్ తాజా ఉత్తర్వులను జారీ చేశారు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఏడు వేల మంది ఉద్యోగుల జీతం దాదాపు ఇరవై ఒక్క వేలకు పెరిగింది. అంతేకాకుండా గ్రూప్ ఇన్సురెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది.