ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ‘సూర్యాపేట టైమ్స్’తో చెప్పారు. ఆసియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరిగిందని, ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతులమీదుగా సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభిస్తారన్నారు.
ఈ మార్కెట్ యార్డు నిర్మాణంలో ప్రతి దశను తాను స్వయంగా పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు వివిధ వ్యాపారులకు అనుగుణంగా ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తున్న మార్కెట్ యార్డులన్నిటిలో సూర్యాపేట మార్కెట్‌యార్డు రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కూరగాయలు, పండ్లు, పూలు, మటన్ అన్నీ ఒకే చోట దొరికేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించామన్నారు.