తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ . సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు సంబంధించిన ఏడు వందల కోట్ల రూపాయల బోనస్ ను త్వరలోనే చెల్లిస్తామని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
2013-14లో సింగరేణి సంస్థ లాభాలు నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కాగా గతేడాది అంటే (2022-23)లో రెండు వేల రెండోందల ఇరవై రెండు కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని సంస్థ సీఎండీ శ్రీధర్ చెప్పారు.
అయితే వచ్చే ఐదేండ్లలో మరో పన్నెండు కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించాము. వీటిలో నాలుగు ఈ డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా అన్నారు.