తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల పంతోమ్మిది తారీఖున మెదక్ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెల్సిందే.
అయితే ఈ పర్యటన ఈ నెల ఇరవై మూడో తారీఖుకు వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పంతోమ్మిదో తారీఖున ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేయడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టరేట్ నూతన కార్యాలయం… ఎస్పీ కార్యాలయం.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసును ప్రారంభించనున్నారు.