తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 20న ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అదే రోజు జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.