వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుండి బలబత్తుల రమేష్,బండారి రమేష్,ఎండి వలీల్ మొహమ్మద్,మంద అనిల్, తీగల చంటి,తీగల రమేష్,మంగళ చంద్రమౌళి, జన్ను వినయ్,పురుషోత్తం చారి తదితరులు నేడు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా 23వ డివిజన్ మాజి కార్పొరేటర్ పార్టీ ఇంచార్జ్ యేలుగం లీలావతి సత్యనారాయణ గారు మరియు బిఆర్ఎస్ నాయకులు ఎల్పుల సునీల్ యాదవ్,బాషాకర్ల హరికృష్ణ పటేల్,లక్కర్స్ మొగిలి,ఎండి అక్బర్, రాము తదితరులు పాల్గొన్నారు.