ఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటే స్వర్గీయ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కృష్ణ అనే చెప్పాలి. రంగా వారసుడిగా రాధాకు ఏపీ రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాదా మొదట కాంగ్రెస్ ఆ తర్వాత ప్రజారాజ్యం, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధ ఎట్టకేలకు పెళ్లి కొడుకుగా మారబోతున్నారు. వంగవీటి రాధ ఎంగేజ్‌మెంట్ ఈనెల 19 న జరగనుంది. సెప్టెంబర్ 6న వివాహ ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. నరసాపురంకు చెందిన స్నేహితుడి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన బర్త్ డే వేడుకల్లో కూడా ఈ అమ్మాయి తళుక్కుమంది. కాగా ఇప్పటి వరకు బ్యాచిలర్‌గా ఉన్న వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త తెలియడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
