77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మార్వో, ఎంపీడీవో, మార్కెట్ కమిటీ, PACS మరియు కొడంగల్ మున్సిపల్ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, అగ్ని మాపక కార్యాలయం, మండల విద్యా శాఖ కార్యాలయం మరియు వివిధ పాఠశాలల చిన్నారులతో కలిసి కొడంగల్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో జండా ఎగురవేస్తూ సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ బ్రిటీష్ పాలకుల బానిసత్వం సంకెళ్లు తెంచుకుని.. భారతమాత స్వాతంత్ర్యం పొందిన రోజు ఇది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలకుల బానిసత్వం నుంచి బయటపడిన రోజు ఇది.
ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాలు.. పోరాటల ఫలితంగా 1947వ సంవత్సరం, ఆగస్టు 15న మనం ఈ స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. ఈ నేపథ్యంలో ఆ మహానుభావులను స్మరిస్తూ.. వారికి మనసారా నివాళులు అర్పిస్తూ.. సగర్వంగా ఈ పంద్రాగస్టు వేడుక జరుపుకుందాం అంటూ కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి .