తెలంగాణలో రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లోని తెలంగాణ భవన్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.