బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో,నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,పట్టణ మున్సిపల్ కార్యాలయం,గాంధీ చౌక్, కొత్త బాన్సువాడ ముదిరాజ్ సంఘం,త్రీ వీలర్ ఆటో యూనియన్ లలో జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొని కోట బురుజు వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి .
నియోజక వర్గ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ పార్టీ అధ్యక్షులు పాత బాలకృష్ణ గారు పతాక ఆవిష్కరణ చేశారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి గారు పతాక ఆవిష్కరణ చేశారు.మున్సిపల్ కార్యాలయం మరియు గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.
కొత్త బాన్సువాడ ముదిరాజ్ సంఘం వద్ద అధ్యక్షులు లింగం గారు పతాక ఆవిష్కరణ చేశారు.త్రీ వీలర్ ఆటో యూనియన్ వద్ద యూనియన్ అధ్యక్షులు సాయిలు గారు పతాక ఆవిష్కరణ చేశారు.గాంధీ చౌక్ లో జాతిపిత మహాత్మాగాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాన్సువాడ ఆర్డీఓ భుజంగ రావు గారు, మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు,జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి గారు,ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్ గారు,సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు,ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు