తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా బి.ఆర్.ఎస్.ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదని,అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.
సంగెం మండలం పోచమ్మతండా గ్రామంలో వారు వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.పర్యటనలో గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన,రూ.52.60లక్షలతో పోచమ్మతండ,మహారాజ్ తండ,జారుబండతండ,బోరింగ్ తండ లలో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.