తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది.సోమవారం గీసుగొండ మండలం దస్రుతండ (మంగళితండ) కు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు.దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ గురుకుల పాఠశాలలు, పేదలకు ఇళ్లు (డబుల్ బెడ్ రూమ్), వెనుకబడిన తరగతుల (BC) సమాజానికి ఆర్థిక సహాయ కార్యక్రమం, ఆరోగ్య లక్ష్మి, దళితబంధు పథకాలు తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించవన్నారు.దేశానికి ఆదర్శంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు, రైతుబీమా, రైతుబంధు పథకాలు అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నదని, దేశం అనుసరిస్తున్నదన్న ఆయన.. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు.
పార్టీలో చేరినవారిలో..ఎన్. వీరన్న,పి.రాంప్రసాద్,బి.గణేష్,ఎన్.బాలు,బి.రాజు,బి.బిచ్య,ఎన్.బాలు, కె.భద్రు,ఎన్.రాజు లతో పాటు 20మందికిపైగా చేరారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి రడం భరత్,సర్పంచులు అంకతి నాగేశ్వర రావు,కెలోతు స్వామి,సొసైటీ చైర్మన్ దొంగల రమేష్,నాయకులు గజ్జి రాజు,శ్రీనివాస్ రెడ్డి,మోతీలాల్ తదితరులున్నారు